పుట:AndhraKavulaCharitamuVol2.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. వెల్లంకి తాతంభట్టు.

ఇతడు కవిచింతామణి యనులక్షణగ్రంథమును జేసిన గొప్పకవి. ఈతడు వైదికబ్రాహ్మణుడు; ఈతని తండ్రి యబ్బయ్య; తల్లి యెర్రమ్మ. ఈకవి కృష్ణరాయని రాజ్యారంభకాలమునం దుండినవాడు. కొంద రీతడు కృష్ణదేవరాయని కాలమునకు బూర్వమునందేయుండెనని చెప్పుదురుగాని యితడు తనకవిచింతామణిలో నైషధము, భోగినీదండకము, జైమినిభారతము మొదలగు గ్రంథములనుండి యుదాహరణములు గైకొని యుండుటచేతను, జైమినిభారతమును రచించిన పిల్లలమఱ్ఱి పినవీరన్న కృష్ణదేవరాయని తండ్రితాతలకాలములోనే యున్నవా డగుటచేతను,తాతంభట్టు కృష్ణరాయనికాలమునకు బూర్వమునం దుండినవా డయినట్టు తోచదు. ఇతడు కవిచింతామణి యందు వ్యాకరణమును, ఛందస్సును, కావ్యలక్షణమునుగూడ గొంత వఱకు జెప్పియున్నాడు. ఈలక్షణవేత్త కవిచింతామణియందు దన్ను గూర్చి వేసికొన్నపద్యము నిం దుదాహరించుచున్నాను.-


సీ. శుచి యెఱ్ఱమాగర్భశు క్తిముక్తామణి యబ్బధీమణిసూను డనఘబుద్ధి,

పావనవశితశాలావతగోత్రు డహార్యధైర్యుండు రామార్యుతమ్ము,

డష్టభాషాప్రక్రియాలబ్దవర్ణుండు సన్నుతసాహిత్య చక్రవర్తి,

యనవద్యసర్వవిద్యాపారదృశ్యుండు విద్వజ్జనవ్రాతవిశ్రుతుండు,

సకలహరిదంతరాళవిశ్రాంతవిశద

కార్తికిక చంద్రికాయతకీర్తి కాంతి

హరినిభుం డాస్యవాణీవిహారవసతి

తామసోల్లంఘి వెల్లంకితాతసుకవి.

ఈతడు రచియించినది లక్షణగ్రంథమగుటచే గవిత్వనైపుణినిగూర్చి