పుట:AndhraKavulaCharitamuVol2.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనులు పిల్లల రామభద్రయ్య యనియు పిలిచెడువాడుక గలదు. ఇతడు కృష్ణదేవరాయని యాస్థానకవి యన్నపేరే కాని యీతనికాల మంతయు నించుమించుగా నారాయనియనంతరముననే గడుపబడినది. ఇతడు కొంతకాలము పింగళి మారన్నకును, తరువాత రామరాజ భూషణునకును సమకాలికుడుగా నుండి కృష్ణదేవరాయల మరణానంతరమున నించుమించుగా నలుబది యేబది సంవత్సరములు బ్రదికి 1580 వ సంవత్సరప్రాంతమునందు మృతినొందెను. ఈతడు చేసినగ్రంథము రామాభ్యుదయము ముఖ్య మయినది. ఇది మిక్కిలి ప్రౌడమయిన కవితాధోరణికలదయి, పదగుంభనమునందు పాండురంగ మహాత్మ్యమును బోలి యమకానుప్రాసములను గలదిగానున్నది. ఈకవి ప్రారంభదశయందు గృష్ణదేవరాయల దర్శనార్థముగా విజయనగరము వచ్చినప్పుడూరిబయల రామరాజభూషణునిశిష్యు లొకపద్యమును గుర్వాజ్ఞానుసారముగా జెప్పబూని కుదురక యాలోచించుచున్నట్లును, వారు చలిచేత వడ్కుచు నచ్చటకు రా దటస్థించిన యీ కవికి చలిమంట వేసి కప్పుకొన బట్ట నిచ్చి యతనిచేత


సీ.మోహాపదేశ తమోముద్రితము లైన

కనుదమ్ముల హిమంబు లునుపరాదు

శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక

ముల జంద్రనామంబు దలపరాదు

శీర్యదాశావృంత శిథిలతాసులతాంత

మసియాడ వీవనల్విసరరాదు

పటుతాపపుటపాక పరిహీణతను హేమ

మింక బల్లవపుటా ర్చిడగరాదు

లలన కానంగకీలికీలాకలాప

సంతతాలీడ హృదయపాత్రాంతరాళ