పుట:AndhraKavulaCharitamuVol2.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మత్తగజదానధారార్ద్రమార్గములను

దరులనీడల నెప్పుడు దిరుగువాడు

మత్తగజదానధార్ద్రమార్గములను

దరులనీడల నెప్పుడు దిరుగుటయ్యె.


చ. చదువు వివేకమూల మని సద్గురుసన్నిధి ధర్మశాస్త్రముల్

చదివి సుధాకరుండు నిజసద్గురుపత్నిని దా రమించుటన్

జదు వవివేకమూలమయి సంభవ మయ్యె నదేమనందు నా

మదనమహత్త్వ మెన్న నసమానపరాక్రమ మెన్నిభంగులన్.


చ. వినుతనిజాంఘ్రుల న్విడిచిపెట్టక పట్టుక నేలవ్రాలి లే

వనిగయుకు న్నరుండు బలుబాసల నమ్మిక లిచ్చి యాదరం

బున గరమంది లేవనిడి భూతదయాంచితమానసోన్నతిన్

దనరినయాత్మవంశకథనంబు వచించిన లేచె వాడొగిన్.


సకలకధాసారసంగ్రహమును ముగింపకమునుపే కృష్ణదేవరాయలు మృతినొందినందున, ఆదరించుప్రభువులు లేక బీదవాడయిన రామభద్రకవి యందందు దిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజుయొక్క మేనల్లు డగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను. ఈకవి గుత్తి యప్పలరాజుపయిని జెప్పిన చాటుపద్య మొకటి యిందు క్రింద బొందుపఱుచుచున్నాను-


రాజమనోజా! విద్యా! భోజా! దీనార్థికల్పభూజా! రిపుసం

భాజా! వైభవవిజితబి డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా!

ఈకవి చిరకాలము జీవించి బహుసంతానవంతు డయి దారిద్ర్యముచేత బాధపడినవాడు. ఈతని సంతానాధిక్యమునుబట్టి యితనిని