పుట:AndhraKavulaCharitamuVol2.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కవికాలమును సరిగా నిర్ణయించుటకు దగిన యాధారము లేవియు దొరికినవికావు. తమనిఘంటువునందు బ్రౌన్‌దొరవా రితడు 1500 వ సంవత్సరప్రాంతముల యందుండినట్లు వ్రాసియున్నారు. ఇందుకు విరుద్ధములైన ప్రమాణములు కనబడు వఱకును మన మాకాలమునే సిద్ధాంతముగా గ్రహింపవచ్చును. ఈ వేంకటనాధుడు పూర్వకవి వర్ణనము నీ క్రిందిపద్యమును జేసియున్నాడు-


మ. హృదయబ్రహ్మరధం బతిప్రియతమం బెక్కింతు జేతోమరు

త్సదనాస్థానికి దెత్తు మానసనభస్సంచారి గావింతు హృ

ద్విదితక్షీరసముద్రఖేలనమునం దేలింతు నుత్కష్టవ

స్తుదులం బ్రాజ్ఞల దిక్కయజ్వ నమరేశున్ సోము శ్రీనాధునిన్.


ఇందు శ్రీనాథుడు పేర్కొనబడియుండుటచేత గవి 1450 వ సంవత్సరమునకు బూర్వపువాడు కాడనుట నిశ్చయము. కవి కత పెదతండ్రినిగూర్చి "లింగక్షోణిపాలుండు యవనసైంధవకాననానలుండు" అని వ్రాసియున్నందున నతడు మహమ్మదీయులకును హిందువులకును దక్షిణహిందూస్థానములో యుద్ధములు జరుగుచున్న కాలములో నుండి యుండవలెను. ఇతడు తన గ్రంథమును హరిహరనాథున కంకితముచేసి, ఆ విషయమున నిట్లు వ్రాసికొనియున్నాడు-


క. ఏచనువు గలదు హరిహర|సాచివ్యము నొంద నన్యజనులకు మది నా

లోచింప దిక్కయజ్వకు|నాచనసోమునకు మఱియు నాకుందక్కన్.


హరిహరనాథునకు గృతియిచ్చుటచే నితడు నెల్లూరిమండలములోనివాడని తోచుచున్నది. అప్పకవిగాని మఱి యే యితర లక్షణ కర్తగాని యీతనిపద్యములను లక్ష్యములనుగా జేకొనియుండలేదు. ఆ హేతువునుబట్టి యితడాధునికుడని యూహించుటకంటె నీతని గ్రంథమునందు లక్షణవిరుద్దములయిన ప్రయోగము లుండుటచేత నుదహ