పుట:AndhraKavulaCharitamuVol2.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయినను పయికథ యిటీవలివారిచేత నెవ్వరిచేతనో కల్పింప బడినట్టు తోచుచున్నది. ఆంధ్రకవితాపితామహు డైన యల్లసాని పెద్దన్న యంత యసూయాగ్రస్తు: డగుటకు దగినకారణ మేదియు గానరాదు. కవికర్ణరసాయనము మొత్తముమీద మంచిదే యయినను, పెద్దనార్యకృతమయిన మనుచరిత్రముకంటె నేవిషయమునందును గుణాతిశయము గలదికాదు.


గీ. యతి విటుడుగాకపోవు టెట్లస్మదీయ

కావ్యశృంగారవర్ణ నాకర్ణసమున ?

విటుడు యతిగాకపోరాదు వెస మదీయ

కావ్యవై రాగ్యవర్ణనాకర్ణ నమున.


అని నృసింహకవి తన కవిత్వసామర్థ్యమును గూర్చి గ్రంథాదియందాత్మస్తుతి చేసికొని యున్నాడు. మఱియు దక్కిన కవులవలెగాక కుకవిదూషణయు బెక్కుపద్యములతో జేసియున్నాడు. కాబట్టి యితడు స్వాతిశయభావము గలవా డయినట్టు కనుపట్టు చున్నాడు. ఇతడు నియోగిబ్రాహ్మణుడయినను భట్టపరాశరాచార్యుల శిష్యుడై వైష్ణవమతమునం దధికాభిమానము కలవాడై యుండెను. మాంధాతృచరిత్రము విశేషభాగము దీర్ఘసమాస సంస్కృతపదభూయిష్టముగా నున్నను బహుస్థలములయందు తెలుగుపదములతోను చక్కని లోకోక్తులతోను గూడ గూడియున్నది. చేసినవర్ణనము లనేకములు హృదయాహ్లాదకరములుగా నున్నవి. కవిత్వమునం దక్కడక్కడ గవిత్రయము వారి ప్రయోగములకు విరుద్దములైన ప్రయోగములు కానబడుచున్నవి. ఈకవియొక్క కవననైపుణిని జూపుటకయి కవికర్ణరసాయనములోని కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-


శా. ఏణీలోచన లాత్మన క్త్రరుచిచే నేణాంకసొఎభాగ్య మ

క్షీణప్రౌడి హరింప సౌధపరిసంకీర్ణేంద్రనీలోపల