పుట:AndhraKavulaCharitamuVol2.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణామండలములోని చల్లపల్లిసంస్థానములో మచిలీబందరునకు పదునాలుగు మైళ్ళదూరములో నున్నది. దీనినిబట్టి కవి కృష్ణామండలములోని వాడగుట స్పష్టము. ఈకవిశ్రేష్టుడు కృత్యాదియందు


గీ. సరససంస్కృతపుష్పగుచ్ఛప్రభూత

మగుతెనుంగనునెత్తావి కఖిలదిశల

దరుణపమానమగు కవిత్రయవిశేష

చతురవాచానిరూఢి కంజలి యొనర్చి

అని పూర్వకవిస్తుతి చేసి


క. చెప్పదగు గవిత రసముల్

చిప్పిల నప్పప్ప బళిబళీ యన లేదా

యెప్పుడు జేయకయుండుటె

యొప్పుజుమీ సుకవి కెంతయుచితజ్ఞడొకో.


శా. గాడార్థప్రతిపాదనక్రమకళాకౌశల్యము ల్లేక వా

చాడక్కార్భటితోడ దామ తము మఝ్ఝూయంచు గైవారముల్

ప్రౌడింజేయుచు బ్రాజ్ఞల న్నగుచు గర్వగ్రంధులై యుండు న

మ్మూడస్వాంతుల మెచ్చకుండుటయె సమ్మోదంబు మాబోంట్లకున్.


సుకవియగువాడు కవిత్వము జెప్పినచో రసము లుప్పతిల్లునట్లుగా జెప్పవలయును లేదా యూరకుండవలయు ననియు జెప్పి కేవల వాగాడంబరమును జూపువారియెడ దిరస్కృతినిజూపెను. కవి కృతిపతి మామగారును కృష్ణదేవరాయని మంత్రియు నయిన తిమ్మరుసును వర్ణించి, అప్పామాత్యుడు తిమ్మరుసు కూతురైన తిరుమలాంబను బెండ్లియైన వార్త నీక్రిందిపద్యములలో జెప్పెను-


సీ. ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియాతత్పరమానసోత్సాహశాలి

యేమంత్రిమణి మిత్రహితబాంధవాశ్రితప్రకరరక్షణకళాప్రౌడబుద్ధి

యేమంత్రిమణి వచోహేలాతినైర్మల్యశీతలతాధూతశీతరోచి