పుట:AndhraKavulaCharitamuVol2.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాలిని. హరిచరణపయోజధ్యానసంధానమార్గా

స్థిరమతిగుణధారా శిక్షి తాఘప్రచారా

సురసురభివితీర్ణి స్తోత్రపాత్రప్రకారా

గిరిచరదరివీరా కృష్ణమాంబాకుమారా! [ఆ.1]


క. శ్రీరమణీరమణీయవి | హారాయితనూత్నలోచనాంభోజయుగా

దోరమితికీర్తినిరసిత | తారకుభృత్కాశ యప్పదండాధీశా- [ఆ.2]

సుగంధి. పారదప్రభావిభాసిభద్రకీర్తివాహినీ

పూర దానధూతదివ్యభూజకామధేను దు

ర్వార యాఱువేలవంశవార్ధి పూర్ణ చంద్రమా

సారబుద్దిజాలనీతశత్రుభూమిభృద్రమా- [ఆ.2]


క. శ్రీచక్రచారుకుచయుగ | సూచకగడోపగూహసూచితపులక

ప్రాచుర్య తత్త్వతత్పర | యాచకసంస్తుత్య మంత్రియప్పామాత్యా-


ఈ యప్పామాత్యుడు కృష్ణదేవరాయని మంత్రియైన తిమ్మరుసున కల్లుడు. మాదయ్యగారి మల్లన్న తా నఘోరశివశిష్యుడయిన ట్లాశ్వాసాంతగద్యమున నిట్లు తెలిపికొనియున్నాడు:-

"ఇది శ్రీమ దఘోరశివాచార్యగురు కరుణావిశేషలబ్ధ సారసారస్వత మాదయామాత్యపుత్ర మల్లయనామధేయ ప్రణీతంబైన రాజశేఖర చరిత్రంబును మహాప్రబంధంబునందు సర్వంబును దృతీయాశ్వాసము."

ఈ యప్పామాత్యుడు కవిని,


ఉ. శంకరపాదసేవ నవశంపదమానస పంకజాత ని

శ్శంకవచోవిలాస రుచిసారవినిర్జితపూర్ణ పూర్ణిమై

ణాంక దురక్షరాన నభయంకర శౌనకగోత్రపాత్ర య

య్యంకిపురాగ్రహారవిభవాకర మారయమల్ల సత్కవీ.


అని సంబోధించి యుండుటచేత మల్లన శౌనకగోత్రసంజాతు డనియు, అయ్యంకిపురాగ్రహారస్వామి యనియు తెలియవచ్చుచున్నది. అయ్యంకి