పుట:AndhraKavulaCharitamuVol2.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోయవె యాడుతోడునను బుట్టవె శాపనిమిత్తమే తపం

బీయెడ నున్నశాంతిపరు లేమనువా రిక నీచరిత్రకున్. [ఆ.4]


శా. తండ్రీ నాకు ననుగ్రహింపగదె వైద్యం బంచు బ్రార్థించినన్

గండ్రల్గా నటు లాడి ధిక్కృతుల బోకాల్మంటి వోహో మదిం

దీండ్ర ల్గల్గినవారి కేకరణినేని న్విద్య రాకుండునే

గుండ్రా డాచిన బెండ్లియేమిటికి జిక్కుం గష్టముష్టింపచా. [ఆ.5]


శా. నీవైశిష్ట్యము తిట్టుల న్మెఱయునే నీకంటె నే దక్కువే

యీవే కన్యక నీవుగాక మఱి మద్వృత్తాన్వయాచారముల్

నీవా పేర్కొనుసాటివాడ విట గానీ నిల్తు గాకేమి పో

పో విప్రాధమ నిన్నుబోల నిక నల్పు ల్లేరు దంభవ్రతా. [ఆ.6]


                          _________

3. నంది తిమ్మన్న

ఈకవి కృష్ణదేవరాయని యాస్థానమునం దుండి ప్రసిద్ధిగన్న వారిలో నొకడు. ఇతడారువేల నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కౌశికగోత్రుడు; నంది సింగన్నకును తిమ్మాంబకును పుత్రుడు; వరాహపురాణాది గ్రంథములను రచించి ప్రఖ్యాతి కెక్కిన మలయమారుతకవికి మేనల్లుడు. ఈతడు శివభక్తుడు. అఘోర శివగురుని శిష్యుడు. ఈకవిని సాధారణముగా ముక్కుతిమ్మన యని వాడుదురు.


శా. నానాసూనావితానవాసనల నానందించుసారంగ మే

లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కానం దపం బంది యో

షానాసాకృతిదాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసియై

పూనెం బ్రేక్షణమాలికామధుకరీపుంజంబు నిర్వంకలన్.