పుట:AndhraKavulaCharitamuVol2.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. చిన్నివెన్నెలకందు వెన్ను దన్నిసుధాబ్ధి

బొడమినచెలువ తోబుట్టు మాకు

రహిపుట్టు జంత్రగాత్రముల ఱా ల్లరగించు

విమలగాంధర్వంబు విద్య మాకు

వనవిల్తుశాస్త్రంబు మినుకు లావర్తించు

పని వెన్నెతోడ బెట్టినది మాకు

హయమేధ రాజసూయము లన బేర్పడ్డ

సవనతంత్రంబు లుంకువలు మాకు

గనకనసీమ గల్పవృక్షములనీడ

బచ్చరాగట్టుగమి రచ్చపట్టుమాకు

పద్మసంభవవైకుంఠ భర్గసభలు

సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర- [మనుచరిత్రము.ఆ.2]


ఉ. వాని బ్రశంసచేయ దగు వాడు కృతార్థతముండు వానిచే

నీనిఖలంబు పావన మహీనకృపావిభవం బెలర్ప నె

వ్వానిగృహాంగణంబునకు వచ్చినత్రోవరజంబులందు నీ

మానితపాదయుగ్మక మమర్చు బ్రపుల్లసరోజదామమున్- [నైషధ. ఆ.3]


ఉ. వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్

వాని దవంధ్యజీవనము వానిదెజన్మము వేరుసేయ కె

వ్వానిగృహాంతరంబున భవాదృశయోగిజనంబు పావన

స్నానవిధాన్నపానముల సంతస మొందుచు బోవు నిచ్చలున్- [మను.ఆ.1]


ఇట్టివాని నింకను బెక్కులు చూపవచ్చును. పెద్దన చెప్పిన పద్యములను గొన్నిటిని తెనాలి రామలింగకవి యాక్షేపించినట్లు కొన్ని