పుట:AndhraKavulaCharitamuVol2.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్తయెదుటికి గొనివచ్చె గంధవాహ

బాంధవం బగునమ్మహాసైంధవంబు. [మనుచరిత్రము. ఆ.4]


ఈయనను జూచి యాకాలపువా డయిన ధూర్జటికవియు దనకాళహస్తి మాహాత్మ్యమునం దీక్రిందిరీతి పద్యములం దన్యభాషాపదములు చేర్చి కూర్చినాడు-


సీ. బిజమాడుదేవర నిజకృపామహిమ జెన్నారునాయిల్లు బిడారునీకు

నాకునీపాదార్చనముసేయనడలింగమూర్తి చేకుఱెవచ్చిమూర్తమాడి

యొడయచిత్తేశ నాయునికి నీమజ్జనమాడు శివార్చన మాడుబేకు

విచ్చేయు డిది బూదివీడియం బందుకో జంగమస్వామి నాసదనమునకు


నోగిరంబులు మంచిమే లోగిరమున

నావటించెద బదుడు మీ రారగింప

బ్రతిదినంబును జంగమార్చనము లేక

దనువు వడనొల్ల రూపకందర్ప యనగ. [కాళహస్తిమాహాత్మ్యము]


ఈయన మనుచరిత్రమునుగూర్చి వ్రాయుచు నొకరు "కొన్ని యెడల నైషధమార్కండేయ పురాణములయందలి వాక్యములకును నిందలి వాక్యములకును సుంతయేనియు భేదమగపడక" యున్నదని యించుక దోషారోపణము చేసియున్నారు. మార్కండేయ పురాణము నందు విపులముగా జెప్పబడిన స్వారోచిషమను సంభవకథనే గ్రహించి మారన తెనిగించిన యా పురాణమును జదివియే పెద్దన మనుచరిత్రమును రచియించినందున నందలి కొన్ని వాక్యము లిందు బడియున్నవి. అంతేకాక యాకవి శ్రీనాథుని కవిత్వమునం దత్యాదరము కలవాడయి యున్నట్లీతని గ్రంథపఠనమువలన స్పష్టముగా గానవచ్చుచున్నది. మొట్టమొదట తెనుగు కవిత్వమునందు సాంస్కృతిక దీర్ఘసమాసములను