పుట:AndhraKavulaCharitamuVol2.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయా కవుల కాలమును గూర్చియు వారివారి విషయమయి చెప్పబడు కథలను గూర్చియు నాయా కవుల చరిత్రములయందు వ్రాయబడును. ఆముక్తమాల్యదయందును, మనుచరిత్రము నందును గల యేకరీతి పద్యములనుగూర్చి సహిత మిచ్చట విస్తరించి వ్రాయుట యనావశ్యకము. అయినను దృష్టాంతము చూపుటకయి యొక్క పద్యమునుమాత్ర మిందుదాహరించు చున్నాను:-


నీ. నీలమేఘముడాలు డీలుసేయగ జాలు

మెఱుగు జామనచాయ మేనితోడ

నరవిందములకచ్చు లడగించుజిగిహెచ్చు

నాయితంబగు కన్నుదోయితోడ

బులుగురాయని చట్టుపలవన్నె నొరవట్టు

హొంబట్టుజిలుగు రెంటెంబుతోడ

నుదయార్కబింబంబు నొఱపువిడంబంబు

దొరలంగ నాడుకౌస్త్య్భముతోడ

జయజయధ్వని మౌళి నంజలులుచేర్చు

శర్వ శతధృతి శతమన్యు శమన శరధి

పాలకై లబిలాది దేవాళితోడ

నెదుట బ్రత్యక్ష మయ్యె లక్ష్మీశ్వరుండు. [మనుచరిత్ర. అ.6]


మనుచరిత్రము యొక్క యాఱవయాశ్వాసమునందు స్వారోచిష మనువు విష్ణునిగూర్చి తపస్సు చేయగా నతడు ప్రత్యక్ష మయినట్టు జెప్పబడిన పయిపద్యమునే దీర్ఘ పాదముల నేమియు మార్పక యెత్తు గీతమునుమాత్ర మీక్రిందిరీతిగా మార్చి యాముక్తమాల్యద ప్రథమాశ్వాసమునందు గృష్ణదేవరాయడు తనకు శ్రీకాకుళాంధ్రదేవుడు ప్రత్యక్షమయినట్లు చెప్పినఘట్టమునందు వేసికొనియున్నాడు:-