పుట:AndhraKavulaCharitamuVol2.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షించి భగవద్భక్తి నిష్ఠాగరిష్టులగు రాజశ్రేష్ఠుల వృత్తంబులు ప్రసిద్ధంబు లగునట్లుగా బ్రశ స్తకథలు విన్యస్తంబులుగా సమకూర్చి సాహిత్యలక్షణచిత్ర కవిత్వప్రభావంబు లొక్కొక్కచోట గనంబడ రచియింపవలయునని ప్రార్థించి మఱియు నిట్లనియె.


చ. అఱవెతగుబ్బచన్వలె బయల్పడనీకయు ఘూర్జనారంగ నా

గురుకుచయుగ్మమున్వలె నిగూడముగాకయు నాంధ్రదేశపుం

గరితచమంగవన్వలె నొకానొకయించుక గానిపించినన్

సరసులు మెత్తు రక్కవిత జాణలకుం గడురంజకం బగున్.


వ. కావున నతిమధుర రసాయన ద్రాక్షాపాకంబుగా శృంగారరసయుక్తం బగునట్లు సకలకథాసార సంగ్రహంబు గ్రంథవిస్తారంబు కాకుండునట్లుగా రచియింపుమని యుపన్యసించిన సంతోషామృతతరంగి తాంతరంగుండ నగుచున్న సమయంబున."

రాజశేఖర చరిత్రమును రచియించిన మాదయగారిమల్లన్న కృష్ణదేవరాయల కాలములో నుండి యా రాజు గోలకొండ బిజాపురపు తురక సంస్థానములను జయించినపు డాతని కీర్తిని వర్ణించినట్లు కుమార ధూర్జటి కృష్ణరాయవిజయమునం దీక్రింది పద్యములతో జెప్పియున్నాడు:-


గీ. అటులు జయలక్ష్మి గైకొని యరులకరుల

హరుల ధనపంక్తులను దనపరము చేసి

వెలయు శ్రీకృష్ణరాయల విభవగరిమ

కాంచి కన్నులపండువుగాగ నపుడు.


గీ. సరససాహిత్యరచనవిస్పురణ మెఱయ

సారమధురోక్తి మాదయగారి మల్ల

నార్యు డలయల్లసాని పెద్దార్యవరుడు

ముక్కుతిమ్మన మొదలైన ముఖ్యకవులు.