పుట:AndhraKavulaCharitamuVol2.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నది. మొదటి యైదుగురునుమాత్ర మాకాలమునం దున్నట్లు కొన్ని గ్రంథ నిదర్శనములు కనబడుచున్నవి. వారిలో నల్లసాని పెద్దనార్యుడు తాను రచియించిన మనుచరిత్రమును, నందితిమ్మన తాను రచియించిన పారిజాతాపహరణమును, కృష్ణదేవరాయని కంకితములు చేసిరి. అయ్యలరాజు రామభద్రుడు కృష్ణదేవరాయల కాలమునందు మిక్కిలి చిన్నవాడై క్రొత్తగా గవిత్వముచెప్పుట కారంభించినవాడు. ఇతడు కృష్ణరాయలు జీవించియుండగా నాతని యాజ్ఞాప్రకారముగా సకల కధాసారసంగ్రహము నారంభించి తరువాత ముగించెనుగాని యది రామాభ్యుదయమువలె నంత ప్రౌడముగా నుండక వ్యాకరణ దోషములు కలదిగా నున్నది. రామభద్ర కవి తన్ను గృష్ణరాయలు కోరుటచేత సకలకథాసారసంగ్రహమును జేసితినని వ్రాసియున్న భాగము నా గ్రంధమునుండి యిందుదాహరించుచున్నాను:-


సీ. చినుకుపూసల నొనర్చినబిత్తరపుదండ దండాలుగల వేల్పుతపసికొండ

కొండాటములను జిక్కులుపన్ను జడదారి దారిగట్టులరాయు చీరుటలుగు

అలుగుడింతకి వెన్ను డిలకు దెచ్చినచెట్టు చెట్టుగట్టుగజేయు చెలువతోడు

తోడుచేడెల నేలుదొరకునుదో బుట్టు పుట్టులిబ్బుల ఱేని పొందుగాడు

గాడుపూరిని గాంచిన కన్నతల్లి | తల్లిబిడ్డల బెండ్లాడు గొల్ల మనికి

మనికితముదీర్చువిలుకాని జెనకువిందు|విందునీకీ ర్తినరసింహవిభునికృష్ణ

వ. ఇట్లు కీర్తివిస్తారధురంధరుండగు కృష్ణరాయ నరపాలాఖండలుండు నన్ను బిలిచి శ్రీమచ్ఛీతారమణ చరణకమల పరిచరణాయమాన మానసుండవు బహువిధ కవితా చమత్కారధుర్యుండవు సకల పురాణేతిహాస ప్రబంధరచనాదక్షుండవు మస్మనోరథకార్య నిర్వాహకుండవు నగుటంజేసి పురాతన మహాకవి విర చిత ప్రబంధంబు లన్వే