పుట:AndhraKavulaCharitamuVol2.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుని జయించినవర్ణన మిందుండుటను బట్టి యీ గ్రంథము 1520 వ సంవత్సరము వఱకును ముగింపబడలేదు. ఈ పుస్తకమునందలి పద్యములు మొత్తముమీద శ్రుతికటువులుగా నున్నను, పెక్కుపద్యము లర్థగాంభీర్యము కలవిగా నుండుటయే కాక మృదుమధురపద గుంభితములైకూడ నున్నవి. కవియొక్క ప్రౌడిమయు కవననై పుణ్యమును దెలియుటకయి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-

మ. శయపూజాంబుజము ల్ఘటిం దడబడ జన్దోయి లేగౌనుపై

దయదప్ప న్బసుపాడి పాగడపు బాదం బొప్ప జెంగల్వడి

గ్గియనీ రచ్చ్యుతమజ్జనార్థము కటిం గీలించి దివ్యప్రబం

ధయుగాస్య ల్ద్రవిడాంగన ల్నడుతు రుద్యానంబులో త్రోవలన్. ఆ - 1


చ. బలసిన హల్లకచ్ఛటలపై దమజుంజురుముండ్లు రాయగా

గలమములుండు బండియెఱుగంబడి నీ రెడలింప దృష్ణ లో

దలకొన వంగి మున్ జలముద్రావెడు క్రిందటివేళ్ళు మీదట

న్నిలిపి మరందమానుకరణి న్నికటోపవనానిలాహతిన్. ఆ . 1


మ. తరుణు ల్తల్లియొఱ న్గుచంబు లునుపం దచ్ఛైత్యము ల్దీములై

పెర రేపం జనుదెంచెగాక రవిదీప్తిం గ్రుంకి పాతాళగ

హ్వరముం దూఱినవాని నీయదుకుత్రాళ్ళా తెచ్చునా దీర్ఘత

చ్చిరకృష్టిం గనునట్టిశైత్య మలరించె న్నూతులం దత్తఱిన్. ఆ.2


మ. గృహసమ్మార్జనమో జలాహరణమో శృంగారపల్యంకికా

వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యద్వజ

గ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ప్రాగ్దీపికారోపమో

నృహరీ వాదము లేల లేరె యితరు ల్నీలీలకుం బాత్రముల్. ఆ.2


ఉ. నావుడు వార లమ్మనుజనాధున కిట్లని రుబ్బి నేడుగా

దైవము గల్గె వేగ గురుదక్షిణగా జతురర్ణ వీవృతో