పుట:AndhraKavulaCharitamuVol2.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్రముతెలియని యితరకవుల గ్రంథములు

అప్పకవీయాది లక్షణగ్రంథములలో నుదాహరింపబడిన గ్రంథము లిప్పుడనేకములు గానరాకున్నవి; కొన్ని గ్రంథముల పేరులు తెలిసినను గ్రంథకర్తలపేరులు సహితము తెలియరాకున్నవి. అమరేశ్వరుని గొప్పకవినిగా పూర్వకవులనేకులు స్తుతించియున్నారు. ఈతడు చేసిన గ్రంథము లేవియో తెలియరావుగాని కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసార సంగ్రహమునందు జిమ్మపూడి యమరేశ్వరుని విక్రమసేనములోనిదని యీక్రిందిపద్యము నుదాహరించియున్నాడు-


గీ. నీర నగ్గియునికి యారయ విస్మయం
   బనుచు బాడబాగ్నికడలి యప్పు
   రంబుజొచ్చెనొక్కొరత్నాకరముమణు
   లనగ జెలువ మమరునాపణములు.

ఈప్రకారముగానే హూణశకము 1650 వ సంవత్సరమునకు బూర్వమునందున్నట్టు నిశ్చయముగా తెలిసిన కొందఱకవుల గ్రంథనామములు తెలిసినను, నా కాగ్రంథము లిప్పుడు లభింపనందున గ్రంథకర్తల చరిత్రమును గూర్చికాని వా రుండినకాలమును గూర్చికాని నేనిప్పుడేమియు వ్రాయుటకు శక్తుడను గాకున్నాను. గ్రంథకర్తల నామములు సహిత మనేకములు తెలియరాలేదు. తెలిసినవారు నా కావిషయమును తెలుపుదురన్న యపేక్షతోను ఇతరు లట్టి గ్రంథసంపాదనమునకయి కృషిచేయుదురన్న విశ్వాసముతోను, ఆ గ్రంథముల పేరులనుమాత్రమిందు జెప్పి వానిలోనుండి దొరకిన పద్యముల నుదాహరించుచున్నాను.


1. కవులషష్ఠము-ఇది యెవ్వరు చేసినదో తెలియలేదు. పుస్తకముయొక్క పేరునుబట్టి యిది యనేక కవులుచేరి చేసినట్లూహింపదగియున్నది. "తృతీయవర్గసరళమునకు రాచమల్లువారి షష్ఠస్కంధ