పుట:AndhraKavulaCharitamuVol2.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   త్రములను దక్క వేఱొకవిధంబున నాంధ్రము జేయజాలమిన్
   క్షమ దెనిగింపు దీన నవి సర్వము జేయుఫలంబు నీ కగున్.

దానిని తెనిగింప నానతిచ్చెనట! శ్రీకృష్ణుడు స్వప్నదర్శన మిచ్చుటకు బూర్వమే గ్రంథమును జేయ సంకల్పించెనో చెప్పలేదు. ప్రక్రియాకౌముది యనబడెడి యీ యాంధ్రశబ్దచింతామణి బాలసరస్వతి కృతమనియు దానికి గౌరవము కలుగుటకయి యీ కధ కల్పింప బడినదనియు నేనీవఱకే చూపి యున్నాను. పయి పద్యములనుబట్టి యీ పుస్తకము శాలివాహనశకము 1578 వ సంవత్సరము నందనగా క్రీస్తుశకము 1656 వ సంవత్సరము నందారంభింపబడి 1660 వ సంవత్సరప్రాంతమున కింతవఱకు జేయబడియుండును. అప్పటికప్పకవి కవసానకాలము తటస్థించినందున గ్రంథము సమాప్తినొంది యుండక పోవచ్చును.


సీ. జగతి నాపస్తంబశాఖోక్తషట్కర్మపద్ధతిఖండనిబంధనంబు
   కాలబాలార్ణవాఖ్యజ్యోతిషగ్రంధసంహితాసుశ్లోకసంగ్రహంబు
   శ్రీమదనంత ప్రసిద్ధమహావ్రతకల్పకథాంధ్రోక్తి కావ్యరచన
   శ్రీనగాధీశసుశ్లేషనిందాస్తుతిభావగర్భితసీసపద్యశతము


   లలితకవిల్సకాఖ్యాసలక్షణంబు | మహితసాధ్వీజనౌఘధర్మద్విపదము
   నంబికావాదనామకయక్షగాన | కృతియు జేసితి నాకునూరికులయప్ప.

అను పద్యమువలన నప్పకవి యీ గ్రంథమును రచించుటకు బూర్వము కొన్ని సంస్కృతాంధ్ర గ్రంథములను రచించినట్టు తెలియవచ్చుచున్నది గాని యిప్పుడాగ్రంథములు లభించుట యరుదు. ఈతని కవిత్వము సుగమమైన మృదుమధురపాకము గలదిగానున్నది. అప్పకవికి బూర్వమునందు రకార ఱకారములకు యతిప్రాసమైత్రి కలదు లేదను నభిప్రాయభేద మున్నను, "నాన్యేషాంవైధర్మ్యం లఘ్వులఘూనాం