పుట:AndhraKavulaCharitamuVol2.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. ఆచెలువంపుజొక్క పుటొయారము లాజిగిప్రాయ మాఘన
   శ్రీచణరూప మాతళుకు జెక్కులచక్కదనంబు లామహా
   ధీచతురత్వ మాపలుకు దేనియ లాగమనంబు లావిభా
   ప్రాచురి యెక్కండం గనుట పల్కుట వింటయు లేదు రావణా. [అరణ్యకాండము]


శా. నీకున్ శత్రుడ గాను భవద్రిపులతో నే సఖ్యముం జేయ నే
    జోక న్నీకపకారిగా నకట యిచ్చో జాలనిర్హేతుకం
    బై కన్నట్టిరుష న్నను న్నిశితతీవ్రామోఘబాణంబుచే
    వే కూల్పంగ నిమిత్త మేమి యిది దోర్వీరంబె శ్రీరాఘవా. [కిష్కిందాకాండము]


ఉ. అంగదు గాంచి యోతనయ యాత్మ వగం దురపిల్ల బోకు ని
   న్నుం గడు నాదుమాఱుగ గనుంగొను నీరవిపుత్రు డిమ్మహో
   త్తుంగభుజప్రతాపనిధితో నెడబాయక యుండినన్ జయా
   భంగురభోగభాగ్యముల బ్రస్తుతి కెక్కి రహింతు వన్నిటన్. [కిష్కింధాకాండము]


ఉ. బంగరుమేలినిగ్గు గలపర్వతమోయన నైజగాత్ర ము
   త్తుంగముగాగ బెంచి మఱితోడనె పాశము లెల్ల నూడ్చి సా
   రంగపరంపరం గదుమురాజితసాహససింహమోయనన్
   బొంగుచు నెంటవచ్చుదితిపుత్రుల బోవగదోలి రోషియై. [సుందరకాండము]


ఉ. రామకరాగ్రముద్రిక ధరాసుతచేతి కొసంగి రాఘవ
   క్షేమము తెల్పియాజనని కేవలశోకము మాన్పి లంక వా
   లామితహవ్యభుక్శిఖల నంతయు దగ్ధము చేసి సీతచూ
   డామణి గొంచువచ్చితి దటాలున నిప్పు డటంచు బల్కినన్. [సుందరకాండము]