పుట:AndhraKavulaCharitamuVol2.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   రమణసత్కవి నీవొనర్పంగ బూను
   కృతివతంసంబు నతని కంకిత మొనర్పు.

సాంబవిలాసమునందు దుర్యోధనపుత్రియైన లక్ష్మణాకన్యను కృష్ణుని కొడుకైన సాంబునికిచ్చి వివాహము చేసినకథ చెప్పబడినది. ఇది సలక్షణమైన గ్రంథము. ఇందుండి రెండుమూడు పద్యముల నిం దుదాహరించుచున్నాను.


చ. కొడవలిచేత బొడ్డు తగ గోసి గడానిపసిండిచేటలో
   నిడి నులివెచ్చనీట నొడ లెంతయు నారిచి మేలిచల్వపా
   వడ దడియొత్తి ఫాలమున బాగుగ నున్నని కాపుదృష్టిబొ
   ట్టిడి రహి దీవన ల్సలిపి హెచ్చుగ నారతు లిచ్చి క్రచ్చఱన్. [ఆ.1]


ఉ. జాంబవతీతనూజు డలసాంబుడు బాల్యమునందు మందహా
   సం బనుభవ్యచంద్రిక సజస్రము మాతృమనోంబుజాతహ
   ర్షాంబుధి బొంగజేయుచు నుదంచితనై జకుమారచంద్రభా
   వంబు యథార్థమై తనర వర్తిలు సత్కళలం జెలంగుచున్. [ఆ.1]


మ. ఒక భిల్లాగ్రణి వెంబడించి తనపై నుత్సాహ మొప్పంగ వ
    చ్చు కఠోరాధికగర్వధూర్వహతరక్షుశ్రేష్ఠమున్ సాంబభూ
    పకరీంద్రంబు నుతింప మేలితళుకుం బల్వాడియందంపునుం
    జికటారింబడ గూల్చి యార్భటు లొనర్చెంబేర్చి శౌర్యంబునన్. [ఆ.1]

ఈకవి భారద్వాజగోత్రుడు; కాత్యాయనసూత్రుడు; ఓబళాంబాపుత్రుడు. ఇతనిచే రచింపబడిన రామాయణమొకటిగూడ గానబడుచున్నది. దానికితడు "విద్వత్కవికర్ణరసాయనసకలవర్ణనాపూర్ణ రామాయణము" అని పేరు పెట్టెను. ఈరామాయణములోని గద్యమునుబట్టి కవి యభిమన్యువిలాసము, కుమార గురువిలాసములోనగు గ్రంథములనుగూడ రచించినట్లు తెలియవచ్చుచున్నది. ఈరామా