పుట:AndhraKavulaCharitamuVol2.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54. చిత్రకవి రమణకవి

ఈకవి సాంబవిలాసమను ప్రబంధమును రచియించి వేంకటేశ్వరుని కంకితముచేసెను. ఇతడు 1630 వ సంవత్సరప్రాంతములందున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇతని తండ్రియైన యనంతకవి రామరాజ భూషణకృతమైన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్య చేసినందున అతడు పదునేడవ శతాబ్దారంభమునం దుండుట స్పష్టము. సాంబవిలాసములోని పద్యముల నప్పకవి లక్ష్యములనుగా జేకొని యుండుటచేత రమణకవి తప్పక తనసాంబవిలాసమును 1650 వ సంవత్సరమునకు గొంతకాలము పూర్వమే చేసియుండవలెను. కవి తన్నుద్దేశించి యీక్రింది వాక్యములను తనపుస్తకములో జెప్పుకొన్నాడు-


ఉ. ఓరమణాఖ్య సత్కవికులోత్తమ ! మామకమంజులాహ్వయ
   శ్రీరమణీయ! నీవిపుడు చేయగ బూనినసాంబలక్షణా
   సారసదృగ్వివాహకథ సన్మతి మాకిపు డంకితంబుగా
   గూరుపు నీకు గల్గు జయగుర్వచలాయురభీష్టవస్తువుల్.



సీ. సర్వలక్షణసారసంగ్రహం బొనరించి
             తనరె మీతాత పెద్దనకవీంద్రు
   డలహరిశ్చంద్రనలాధీశ సత్కథా
             శ్లేషసత్కృతికి బ్రసిద్ధిగా గ
   గవిహితుండౌచు వ్యాఖ్యానంబు వొనరించి
          మరియు నిందుమతీసుపరిణయంబు
   మొదలైనసత్కావ్యములు చేసి రహిగాంచె
            నరయ మీతండ్రి యనంతసుకవి
   చిత్రకవిమంజులాన్వయక్షీరవార్ధి
   చంద్రమూర్తిని సద్బుద్ధిశాలి వీవు