పుట:AndhraKavulaCharitamuVol2.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గమమువచ్చి "ముఖమునందము" "రాజునాన" యని యుండవలసినదానికి మాఱుగా నుగాగమము పోగొట్టి ప్రయోగించినాడు.


మ. అని బాహాపరిరంభ సంభ్రమరసాయతైకచిత్తంబునం
    దను నీక్షింప నెఱింగి యందియలమ్రోతం గేకినున్ రా సఖీ
    జను లేతెంచి రటంచు వేమొఱగి హస్తంబు న్విడంజేసె నే
    ర్పున దప్పించుకపోవ భూవరు డనుం బూబోడికిం గ్రమ్మఱన్. [విజయవిలాసము]


సీ. నిలుచుండి చంక జేతులపెట్టుక కిరీటములు గలరాజులు కొలువుచేయ- [సారం]

ఇందు "తప్పించుకొని" "పెట్టుకొని" యని యుండవలసిన చోట్ల కొనునకు మాఱుగా కవర్ణకము ప్రయోగించినాడు.



సీ. చెంత గూర్చుండని చేజూప గూరుచుం
   డెదవుగా కూరకుండెదవు సుమ్ము. [విజయవి]

అచ్చు పరమగునపుడు స్రార్థనార్థక మధ్యమపురుష మువర్ణకమునకు లోపము రా గూడకపోయినను "గూర్చుండు" అని మువర్ణలోపము కలిగించి ప్రయోగించినాడు.


ఉ. ఓనృప నాకు జూడ నటయుగ్మలి నీసుతునిన్ మనోహరా
   మానవిలాను జూచి నిలు పోపక పట్టిన లోనుగామి నెం
   తే నెగు లూని వాని బొలియింపగ మాయలు పన్నె నిట్లు కొం
   డేనకు ధర్మరా జలుగు నిక్కముగా మిము జెప్పనేటికిన్- [సారంగధ]

తెలుగులందు గొన్నియెడల లులనలు పరమగునపుడు మువర్ణము లోపించి పూర్వమందున్న యకారమునకు మాత్రమే దీర్ఘము రావలసియుండగా నిచట గొండెమునకని యుండవలసినదానికి మాఱుగా నెకారమునకు దీర్ఘముపెట్టి కొండేనకని ప్రయోగించినాడు.


ఇట్లు లఘ్వలఘు రేఫములకు యతిప్రాసములయందు మైత్రి