పుట:AndhraKavulaCharitamuVol2.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   నుండ న్రాఘవకృష్ణపాండవకథాయుక్తప్రబంధంబు వా
   క్పాండిత్యం బలరార శ్లేషరచనైకప్రౌడి నే జేసెదన్.

ఇతడు రచియించిన యీరాఘవయాదవపాండవీయము మూడర్థములు గలది. ఇట్లు త్ర్యర్థికావ్యములను రచియించినవారిలో నితడే మొదటివాడు. పూర్వోదాహృతమయినసీసపద్యమువలన నితడు రంగకౌముదియనునాటకమును, చంద్రికాపరిణయమను ప్రబంధమును, ఆంధ్రశబ్దచింతామణి వ్యాఖ్యానము, భాషావివరణము నను లక్షణగ్రంథములను రాఘవయాదవపాండవీయ మనుత్ర్యర్థికావ్యమును రచియించినట్టు కనబడుచున్నది. ఇత డాంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్యానము మాత్రమే చేసినట్టు పయిపద్యమున జెప్పబడినను మూలగ్రంథమునుగూడ నితడే చేసి గౌరవము కలుగుటకయి దానికర్తృత్వమును నన్నయభట్టున కారోపణచేసినట్లనేక హేతువులచేత నిశ్చయింప దగియున్నది. ఈవిషయమునుగూర్చి నన్నయభట్టారకునిచరిత్రమునందు గొంత వివరముగా వ్రాసి యున్నాను. నన్నయభట్టునకు శబ్దశాసను డన్నబిరు దీశబ్దశాస్త్ర నిర్మాణముచేత గలిగినదని కొందఱు భ్రమపడుచున్నారుగాని యది సరి కాదు. నన్నయభట్టారకుడు మొట్టమొదట లక్షణప్రాయమైన సత్కావ్యమును రచియించి యితరకవులకు కావ్యరచనకు దారిచూపుటచేత నాతనికి వాగనుశాసను డన్న బిరుదము వచ్చినదేకాని వ్యాకరణనిర్మాణముచేత రాలేదు.

"భట్టార బాలసరస్వతికవి మహోపాధ్యాయుడు" తానురచియించిన చంద్రికాపరిణయమును పర్తియాల జమీన్ దారుడగు జూపల్లి వేంకటాద్రి కంకితముచేసెను. ఈపర్తియాల బెజవాడకు రెండామడల దూరమున నిజామురాష్ట్రములో నున్నది. ఈకవిని కాకునూర్యప్పకవి చూచియుండవచ్చును. చంద్రికాపరిణయము కృతినాయకునితండ్రి.