పుట:AndhraKavulaCharitamuVol2.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ. ధరణీనాధ దరిద్రతాపిశునవస్త్రస్ఫూర్తి నాభారతీ
    వరనంశోత్తమసూతి చింతిలగ నవ్వారాంగనామాత ని
    ర్భరపాండిత్యము జూపి దీనదశకున్ రాబోలు నీపాటి జే
    పరమేశా యనిపించగావలదె విప్రస్వామి నంచు న్మదిన్. [ఆ.2]

ఉ. ఓడకు మోయి భూసురకులోత్తమ నెత్త మకారణంబ నే
   నోడితి నీవు గెల్చితి సమున్నతి న న్నతిరోషవృత్తి నీ
   వాడినయంతనట్టు సహజార్థమ యర్థమహాభిలాషుడై
   యోడిన బన్నిదంబు పడకుండిన జండినకా దలంపరే. [ఆ.3]

మ. అపరాథంబులు పెక్కుచేసితి మహాహంకారకామిక్రియా
    విపులాంభోనిధి గ్రుంకువెట్టి జడతావేశంబున న్మిమ్ము ది
    వ్యసధోద్వృత్తిని గొల్వ నైతిని మనోవాక్కాయకర్మంబులన్
    జపలాత్ము న్నను బ్రోవుమీ దయయకా సాక్షాత్కటాక్షేపణా. [ఆ.3]

ఉ. ఎక్కడివాడవోయి యొకయింత యెఱుంగవు బుద్ధికౌశలం
   బెక్కడి కేగె నాలుకపయి న్నువుగింజయు నాననట్టిబల్
   తక్కరినారదుం డతడు దైవతమార్గమునందు నేగగా
   నక్కడ నన్ను బేర్కొనియె దాతడు విన్న ననర్థ మొందదే. [ఆ.4]

చ. నెఱయ విషాదహేతువుగ నీతెలిగన్నుల నశ్రుబిందువుల్
   దొరుగు టెఱుంగ మెన్నడు కుతూహలకారణబాష్పజాలముల్
   కురియుటెకాని నేడు కనుగొల్కులవెంబడి నశ్రుపూరముల్
   వరదలుగట్ట నేడ్చెదవు వారిజలోచన యేర్పరింపవే. [ఆ.4]

సుగ్రీవవిజయములోని ఈకడపటిద్విపదమువలన గవినిగూర్చి కొంత తెలియవచ్చును.


ద్వి. అని కందుకూరి జనార్దనుపేర