పుట:AndhraKavulaCharitamuVol2.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొన్నగదమ్మ పిన్నమొనమొల్కలు నే డివె ముద్దులాడిలే
జన్నులు గొప్పలై పయిటసందున దాగుడుమూత లాడెడున్.

ఈపద్యమును రాయలవారియాస్థానములో జదివినప్పుడు రామకృష్ణకవి మొల్కయని ప్రయోగించినందు కాక్షేపించెననియు, అందు మీద నొకరు దానికి సమాధానముగా నీక్రిందిపద్యమును జెప్పిరనియు, బ్రౌన్ దొరవారు సంపాదించి చెన్నపురిరాజధానిలోని ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమున కిచ్చిన చాటుపద్యమంజరిలో వ్రాయబడియున్నది-


చ. వెలగకు వెల్గ యంచు సరవిన్ జఱికొండ నృసింహు డాడగా,
   మొలకకు మొల్క యంచు గవిముఖ్యుడు భద్రయపల్కదోసమా?
   బళిబళి: మంచిమాటయె ప్రబంధమునా జలరాశి దానిలో
   పల నెరసు ల్గణింతురె యపారములౌ మణు లెల్ల నుండగన్?

చలికొండనృసింహుడు వెలగకు వెల్గ యనియు, అగసాలె రుద్రయ యనునాతడు మొలకకు మొల్క యనియు, అపప్రయోగములు చేసిరని యప్పకవి చెప్పి యీపయిపద్యము వినకొండలో గుంటు పల్లెభాస్కరునివద్ద గందుకూరి రుద్రయ్యగారు చెప్పినట్లీక్రిందిపద్యములలో వ్రాసియున్నాడు-


చ. కొలదిగ మున్ను చెప్పె జలికొండ నృసింహుడు వెల్గయంచు నీ
   వల నగసాల రుద్రపనువాడును మొల్క లటంచు గూరిచెం
   దెలియక కొంద ఱిట్లు వికృతిం బదమధ్యమునన్ లకార రే
   ఫలతలపై యకారమును బాపుదు రార్యులు నవ్వునట్లుగన్.

వ. ఇందులకు వినకొండలో గుంటుపల్లె భాస్కరయ్యగారి సమ్ముఖ మందు గందుకూరి రుద్రయ్యగారు చెప్పినపద్యము.

చ. వెలగకు వెల్గ యంచు సరవిం జవికొండ నృసింహు డాడగా
   మొలకకు మొల్క యంచు గవిముఖ్యు డురుద్రయ పల్క దోసమే?