పుట:AndhraKavulaCharitamuVol2.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను పాలకులనుగా నేర్పఱిచెను. ఈతడే తుంగభద్రానదికి విజయనగరమువద్ద వంతెన కట్టెను. ఈతనికి తిమ్మరుసు మంత్రిగా నుండెనుగాని యతడు రాజునకంటె మూడు సంవత్సరములు ముందుగా మృతినొందెను.

ఈకృష్ణదేవరాయలది తుళువవంశము. ఇంటిపేరు సాళువవారు; పూర్వు లావఱకు వసియించిన గ్రామనామములనుబట్టి సంపెటవారనియు, సెలగోలవా రనియు కూడ గృహనామము గలదు. ఈకడపటి రెండు పేరులును కరణములు వ్రాసియుంచిన కొండవీటికవిలె చరిత్రమునం దుదాహరింపబడి యున్నవి. ఇంతవఱకును రాజుయొక్క విజయములను గూర్చి సంక్షేపముగా వ్రాసియున్నాను. ఇక నీతని పాండిత్య ప్రభావాదులనుగూర్చి కొంత వ్రాయవలసి యున్నది. పూర్వకాలమునందు భోజరాజు సంస్కృతభాష నాదరించినట్లే యిత డాంధ్రభాష నాదరించి కవులను సన్మానించి గ్రంథరచన చేయించుటచేత నీతని కాంధ్రభోజుడని బిరుదనామము గలిగినది. ఇతడు కవుల నాదరించి కావ్యములు చేయించుటయే కాక తానుగూడ విద్వాంసుడై సంస్కృతాంధ్రములయందు గ్రంథములను రచియించుటకు సమర్థు డయియుండెను. ఈతడు సంస్కృతమునందు బెక్కుగ్రంథములు రచించినట్టు విష్ణుచిత్తీయమునందలి యీపద్యమునందు జెప్పబడియున్నది

సీ. పలికి తుత్ప్రేక్షోపమల జాతిపెం పెక్క రసికులౌనన మదాలసచరిత్ర

భావధ్వనివ్యంగ్యసేవధిగాగ జెప్పితివి సత్యావధూప్రీణనంబు

శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి సకలకథాసారసంగ్రహంబు

శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగరచించితిసూక్తినై పుణిజ్ఞానచింతామణికృతి

మఱియు రసమంజరీముఖ్యమధుర కావ్య

రచనమెప్పించుకొంటి గీర్వాణభాష