పుట:AndhraKavulaCharitamuVol2.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగానే కావుకావని యఱచుచు నింట నేమూలజూచినను దామే యయి పట్టపగలు పిశాచములు సంచరింప జొచ్చెనట.

3. పెద్దాపురపు సంస్థానాధీశ్వరులయిన శ్రీవత్సవాయి తిమ్మగజపతిమహారాజుగారి దర్శనార్థము పోయినప్పుడు రాజు కవికి దర్శన మియ్యకపోగా గోపించి,


క. అద్దిర శ్రీభూనీళలు |ముద్దియ లాహరికి గలరు మువురందులలో
   బెద్దమ్మ నాట్య మాడును|దిద్దమ్మని వత్సవాయితిమ్మనియింటన్.

అని శపింపగానే రాజు రాజ్యమును బోగొట్టుకొని దరిద్రు డయ్యెనట!

4. రామకవి యిల్లు కట్టించుకొనునప్పుడు దారిని బోవువారి నందఱిని బిలిచి తనగోడకిటుక లందిండని నియమించుచుండెనట! ఒకనా డాదారిని అడిదము సూరకవి పోవుచున్నప్పు డాతనిని బిలిచి తక్కినవారి నడిగినట్లే యతనిని గొన్ని యిటుక లందిచ్చి పొమ్మని యడుగగా నతడు కోపించి రామకవి యని యెఱుగక,

"సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు"

అని పలికి పో బోయెనట| రామకవి యామాట విని కన్ను లెఱ్ఱచేసి బిగ్గఱగా,

"రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ"

అని కేకవేసెనట. అంతట సూరకవి యతడు రామకవి యని తెలిసికొని కొన్నియిటుక లందిచ్చి మఱి వెడలిపోయెనట!

ఇవి యన్నియు గేవల కల్పితకథ లయి యుండవచ్చును. ఇటువంటి మహామహిమగలవా డన్న వేములవాడభీమకవి కోమటిపేర గృతిచేసి స్తుతించినట్లే యీరామకవియు గంసాలిపేర గృతిచేసి స్తుతులు చేసెను. ఈతడును నయ్యంకి బాలసరస్వతి యను మఱియొక కవియు గలిసి రచియించిన నాగరఖండమనెడి యైదాశ్వాసముల గ్రంథమొకటి