పుట:AndhraKavulaCharitamuVol2.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. ఒక్కని బిల్వనంపి, మఱియొక్కనిచేత బసిండిపట్టి, వే
   ఱొక్కనియింటి కేగుచు, మఱొక్కని నానడుచక్కి నొక్క-
   బొక్కికలంచి చూడ భ్రమబొంది విటుల్తెలియంగ లేరుగా
   కెక్కడిసత్య మేడవల పెక్కడినేమము వారకాంతకున్?

గీ. అనఘ వేశ్యావిడంబవర్తనము లెన్న
   నిసుకపాతఱ యీజోలి యేల త్రవ్వ?
   నప్పడుపుగూటిపై నసహ్యత జనించి
   నామనసు రోసినట్టిచందంబు వినుము.
        * * * *
గీ. వారసతులైన యీసీమవారివలెనె
   మోడిమానిసి నైన నేగోడు నెఱుగ;
   జిహ్వ నాల్గచ్చరాలు నేర్చినకతాన
   బడుపు గూటికి మనసు గొల్పక నిటైతి.

అని వేశ్యావృత్తిని నిందించుచు తియ్యనిమాటలుచెప్పి యాతని చెంత జేరి పరిచర్యచేయుచు దాస్యమిషమున మెల్ల మెల్లగా----యుల్లము కలంప జొచ్చెను. ఇట్లు కొంతకాలము దాసురాలి---గలుగునప్పటికి,


శా. ఆవిప్రోత్తమువజ్రపంజరనిభంబై నిశ్చలంబైన స
   ద్భావం బంగనసాహచర్యగుణసంపర్కంబునన్ లోహమై,
   గ్రావంబై, దృడధారువై, తరుణవృక్షంబై ఫలప్రాయమై,
   పూవై, తన్మకరందమై, కరగె బో బో నీళ్ళకుం బల్చనై.

విప్రనారాయణుని వజ్రకఠినమైన హృదయము దినదినక్రమమున గరగి నీటికంటెను బలుచనై దేవదేవి మనస్సులో నైక్యమయ్యెను. అంతట గురువే దాసురాలికి దాసుడయి పరిచర్యచేయ నపేక్షించి----కొనగా మొట్టమొదట నాటక్కరివారాంగన,