పుట:AndhraKavulaCharitamuVol2.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుచ్చుచుండెను. అల్లసానిపెద్దన తనస్వారోచిషమను చరిత్రమును, నంది తిమ్మన తనపారిజాతా పహరణమును, 1516 వ సంవత్సరమునకు తరువాతను 1520 వ సంవత్సరమునకు లోపలను కృష్ణదేవరాయనికంకితము చేసిరి. 1519 వ సంవత్సరాంతమునందు బీజపురమహమ్మదీయులతో యుద్ధము చేసి, 1520 వ సంవత్సరమునందు సుల్తానయినయేడిల్ ఖానుని జయించెను. ఈయుద్ధవార్త పూర్వోక్తములైన రెండుగ్రంథములయందు నుదహరింపబడక పోవుటచేత నవి యీ యుద్ధమునకు బూర్వమునందే రచియింపబడినట్టు నిశ్చయింపవలసియున్నది. అయినను గృష్ణదేవరాయలే తన యాముక్తమాల్యదయం దీయుద్ధవృత్తాంతము నీక్రింది పద్యముచే జెప్పియున్నాడు:-

మ. అలుక న్ఘోటకధట్టికాఖుర పుటీహల్య న్గురాసానిపు

చ్చలువో దున్ని చలచ్చమూగజమదాసారప్లుతిన్ గీర్తిపు

ష్కలసస్యం బిడి యేకధాటి బళిరా కట్టించితౌ దృష్టి కే

దులఖానోగ్రకపాల మర్థపహరిద్భూజాంగలశ్రేణికన్.

పయిపద్యమునుబట్టి యాముక్తమాల్యద 1520 వ సంవత్సరమునకు దరువాత రచియింపబడిన ట్లేర్పడుచున్నది. ఓరుగల్లు, గోలకొండ మొదలయిన సంస్థానములను గూడ జయించి యితడు తనరాజ్యమును దక్షిణహిందూస్థానమునం దంతటను వ్యాపింపజేసెను. ఈదక్షిణదేశమును పాలించినరాజులలో నింతగొప్పరాజ్యమేలినరాజు మఱియెవ్వడును లేడు. ఒడ్డిరాజు లయిన గజపతులను, తురుష్కరాజు లయిన యశ్వపతులను, తెలుగురాజు లయిననరపతులను, జయించుటచేత నీతనికి మూరురాయరగండడని బిరుదు కలిగినది. ఇటువంటి బిరుదము లనేకము లీయనకు గలవుగాని యవి యన్నియు నిందు వివరించుట యనావశ్యకము. ఈతడు శ్రీరంగపట్టణము, మధుర, తిరుచనాపల్లి, మళయాళము మొదలయిన దేశములను పాలించుటకు తెలుగునాయకు