పుట:AndhraKavulaCharitamuVol2.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. ఆదేశికపదకమలము
లాదరమున హృదయవీధి ననవరతంబున్
మోదమున నిలిపి శ్రీలల
నాధవుని గొలుతురు నారనయు మాదనయున్.

ఈపద్యములనుబట్టి యీచిత్రభారతకృతిపతియు పాండురంగమాహాత్మ్య కృతిపతి కాలములోనివా డయిన ట్లేకగురుశిష్యత్వము వలన దేటపడుచున్నందున, ఈధర్మకవి యించుమించుగా తెలాలిరామకృష్ణుని కాలపువాడే. కందాళ అప్పలాచార్యులుగారు చిత్రభారత కృతిపతితండ్రికి గురువై నందున, ధర్మకవి రామకృష్ణునికి గొన్ని సంవత్సరములుతరువాత నుండిన నుండవచ్చును. చిత్రభారతకవిత్వ మనర్గళ మయిన ధారకలదయి సలక్షణముగా నున్నది. ఈకవియొక్క చరిత్రమునుగూర్చి యిప్పుడు చెప్పినదానికంటె నధిక మేమియు దెలియరానందున, చిత్రభారతమునుండి కొన్నిపద్యముల నుదాహరించుటతోనే తృప్తినొందవలసి యున్నది.


చ. అనిమిషనాధు డమ్మునితపోనలకీలల నబ్ధి యింకినన్
దనకు విపక్షుడై యచట దాగిన యాహిమవన్నగాత్మజున్
గినిసి విపక్షు జేయ గమకించి ప్రచేతనునింట నిర్గమం
బనిచెడువిల్లనంగ నపరాశ సురేశ్వరచాప మొప్పెడున్. [ఆ.2]


సీ. ప్రవహించుశృంగారరసపూర మమ్మునిమేనికి జలకంబుగా నొనర్చి
తళతళత్కాంతిచే దనరెడుదరహాసచంద్రి కావితతి వస్త్రముగ నొసగి
మువ్వంపు దేనియల్ చివ్వున నిడువాక్యములు ప్రసూనములుగా బూజచేసి
చొక్కంపునిడువాలు జూపు మెఱుంగులుపొసగనీరాజనంబులు జేసి
యమృతరసములు చిప్పిలునధరబింబ
మదన నై వేద్యముగను నియ్యగ దలంచి