పుట:AndhraKavulaCharitamuVol2.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33. తరిగొప్పుల మల్లన

ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రములోని యీక్రిందియెత్తుగీతములో జెప్పినాడు -


సీ. ... ... ... ... ...

అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ

రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర

రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ

చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి.


ఈవేంకటపతిరాయలు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ వఱకును రాజ్యముచేసినవా డయినందున, కవియు నాకాలమునం దుండినవాడే. తాలికోట యుద్ధమయినతరువాత తండ్రియైన తిరుమలదేవరాయడు తనరాజధానిని విజయనగరమునుండి పెనుగొండకు మార్చుకొన్నట్లే కొమారుడైన యీవేంకటపతిరాయడును తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చుకొనెను. ఈకవి కవితా రచనను సూచించెడుపద్యములను రెంటిమూటి నిందు బొందుపఱుచు చున్నాను-


ఉ. అంత దిగంతదంతురల తాంతనిశాంతని తాంతకాంతవ

న్యంతిక తాంతపాంధజనతాంతరసంతతకృంతనప్రధా