పుట:AndhraKavulaCharitamuVol2.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. ఉదయాద్రి వేగనత్యుద్ధతి సాధించెవినుకొండ మాటమాత్రన హరించె

గూటము ల్సెదరంగ గొండవీడగలించె బెల్లముకొండ యచ్చెల్ల జెఱిచె

వేలుపుకొండ నుద్వృత్తి భంగము సేసె జల్లిపల్లె సమగ్రశక్తి గూల్చె

గినుకమీఱ ననంతగిరి క్రిందుపడ జేసె గంబంబుమెట్లు గ్రక్కనగదల్చె

బలనికాయము కాలుముట్టల నడంచు

గటకమును నింక ననుచు సుత్కలమహీశు

డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతడు

రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు:-పారిజాతాపహరణము.

సీ. తొలుదొల్త నుదయాద్రిశిలదా కితీండ్రించు నసిలోహమున వెచ్చనయిజనించె

మఱికొండవీ డెక్కి మార్కొని నలియైనయలకసవాపాత్రు నంటిరా జె

నటసాగి జమ్మిలోయబడి వేగదహించె గోనబిట్టేర్చె గొట్టానదగిలె

గనకగిరిస్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె నవులనాపొట్ణూరు రవులు కొనియె

మాడెములు వ్రేల్చె నొడ్డాది మసియొనర్చె

గటకపురి గాల్చె గజరాజు గలగిపఱవ

దోకచిచ్చన నౌర యుద్ధురత గృష్ణ

రాయబాహుప్రతాపజాగ్రన్మహాగ్ని.

చ. అభిరతి గృష్ణరాయడు జయాంకములన్ లిఖియించి తాళస

న్నిభముగ బొట్టునూరికడ నిల్పినకంబము సింహభూధర

ప్రభు తిరునాళ్ళకుం దిగుసురప్రకంబు కళింగమేదినీ

విభు నపకీర్తిక జ్జలము వేమఱుబెట్టిపఠించు నిచ్చలున్:-మనుచరిత్రము.

పూర్వదిగ్విజయయాత్ర చేసి వచ్చినతరువాత మూడుసంవత్సరములవఱకును కృష్ణదేవరాయలు యుద్ధము లేమియు జేసినట్టు కానబడదు. అత డాకాలమునందంతటను విద్యావ్యాసంగమునందు ప్రొద్దు