పుట:AndhraKavulaCharitamuVol2.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాతిపెట్టి తాను పలాయితుఁ డయ్యెనట. అటుతరువాత రాజభటు లేనుఁగును గొనివచ్చి దానిచేత చాకలవానితల త్రొక్కించిరట. రాజభటులు పోయి తాము రామకృష్ణుని జంపినమాట రాజుతో విన్నవించిన తరువాత రామకృష్ణుఁడు రాజసభకుఁ బోయి సభవారందఱు విస్మయపడునట్లుగా రాజసందర్శనము చేసి తనయం దీశ్వరుఁ డనుగ్రహించి చచ్చినవానిని మరల బ్రతికించి పంపెనని రాజునకు నమ్మకము పుట్టు నట్లుగాఁ జెప్పి నమ్మించి రాజువలన నూఱుతప్పులు క్షమించునట్లు వరము పొందెనట.

ఇంకొకసారి రామకృష్ణుఁడు తాతాచార్యులను మోసముచేసి తన్ను మూఁపుమీద నెక్కించుకొని రాజమందిరము చేరువనుండి మోసుకొనిపోవున ట్లొడఁబఱిచె ననియు, ఆచార్యులవా రాతనిని మోసుకొని రాజవీధిలోఁ నడుచుచుండగా రాజు మేడమీదనుండి చూచి కోపించి పయివానిని తన్ని యీడ్చుకొనిరండని తనభటులకాజ్ఞ యిచ్చెననియు, రామకృష్ణుఁ డామాటలువిని చివాలున తాను క్రిందకుఱికి గురువర్యుల పాదములమీఁదఁ బడి తానుచేసిన భాగవతాపచారము క్షమింప వేడుకొని పాప పరిహారార్థముగా నాతనిని తనవీఁపుమీఁద నెక్కించుకొని మోచెదనని చెప్పి యొప్పించి తాతాచార్యులను భుజములపయి నెక్కించుకొని నడుచుచుండఁగా రాజభటులువచ్చి పయినున్నగురునే తన్ని రాజసన్నిధి కీడ్చుకొని పోయిరనియు, అందుమీద రాజునకు మఱింత యాగ్రహమువచ్చి గురుద్రోహియైన యాఖలుని వెంటనే శిరశ్ఛేదము చేయుఁడని భటుల కాజ్ఞ యొసఁగె ననియు, రాజభటుల కతడు లంచమిచ్చి తన్నువిడిచిపెట్టి యొకమేనుజంపి దాని నెత్తురు గొనిపోయి రాజునకు జూపునట్లు వారి నొడఁబఱిచెననియు, రాజు కోపముతీఱి బ్రహ్మహత్య చేయించినందునకుఁ బశ్చాత్తాపపడుచున్న కాలములోఁ దాను బ్రహ్మరాక్షసుఁ డయినట్లు వేషమువేసి రాజును