పుట:AndhraKavulaCharitamuVol2.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోనుండి యొక్కపద్యమునైన నుదాహరించియుండలేదు. ఇప్పుడు పాండురంగవిజయములోనివని యందందు జదువబడెడు పద్యములలో ననేకము లితరగ్రంథములలోనివిగాను కొన్ని యప్రౌడకవికల్పితములుగాను గానబడుచున్నవి. ఎట్లనగా,


సీ. భుజగలోకాధీశభోగతల్పశయాన హరిరూపధర మహాపురుష యనుచు

నతులాబ్జమకుటవర్ణితపాదరాజీవ రామార్చనీయ శ్రీరంగయనుచు

మారీచమదభంగ మహితవాయవ్యాస్త్రశరదనిద్రితనేత్రశౌరియనుచు

సముదగ్రవర్షావసరయోగనిద్రాణ కరిరాజవరద శ్రీకాంతయనుచు

దల కు నులుకును నలుకు బెగ్గిలుచు బలుకు

సఖులనయనస్వరశిరోజచరణకలన

పవనకందర్పఘనహంసజవనతురగ

భటనటప్రియసముదాయపటిమదోప


ఈపద్యము పాండురంగవిజయములోనిదని సర్వసాధారణముగా జదువుదురు. నిజము విచారింపగా నిది పైడిమఱ్ఱి వేంకటపతికృతచంద్రాంగదచరిత్రమునందలి చతుర్థాశ్వాసములోనిది. ఇట్లే


గీ. అరుణపల్లవరుచిబోలు నా పదంబు

లాపదంబుల బోలు సయ్యలకజాత

మలకజాతముబోలు న న్నెలతనడుము.

నిత్య ముఖ లీలబోలు న న్నెలతనడుము.


అను నీపద్యము పాండురంగవిజయములోని దని కొందఱు చెప్పుచున్నను. ఇది సింహాద్రి వేంకటాచార్య విరచితమైనచమత్కారమంజరిలో గనబడుచున్నది. ఈప్రకారముగానే పాండురంగవిజయములోని వని చదువబడెడు మఱికొన్నిపద్యము లితరప్రబంధములోనివిగా గనబడు చున్నవి. తాను ప్రబంధరూపముగా బాండురంగమహాత్మ్యములో జెప్పినకథనే స్వీకరించి యాకవియే మరలపాండురంగవిజయమని మఱి