పుట:AndhraKavulaCharitamuVol2.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలయు మంగయగురునభూవుభుని పెద్ద

సంగభూపాలమణి వ్రాయసప్రవర్తి

ప్రియయుతుం డైనరామానుజయసుతుండు

భద్రచారి విరూరి వర్దాద్రిశౌరి.


కృతినాయకు డైనవేదాద్రికి ఒరభువగుసంగరాజుయొక్క తండ్రి గురువరాజు సదాశివదేవరాయని రాజ్యకాలములో నుండి యాతని నలన శాలివాహనశకము 1465 వ సంవత్సరమునం దనగా హూణశకము 1545 వ సంవత్సరమునందు దేవుని నిమిత్తము నాలుగుగ్రామములు సంపాదించినట్టు మెకంజీదొరవారు సమకూర్చి చెన్నపురిలో ప్రాగ్దేశలిఖితపుస్తక నిలయమునం దుంచిన స్థానిక చరిత్రమువలన దెలియవచ్చుచున్నది. మంగయకొడుకైన గురువరాజును మంగయతమ్మునిగా జెప్పిన యాచరిత్ర మెంత నమ్మవచ్చునో యాలోచనీయముగా నున్నది. ఈకాలమును బట్టిచూచినను గురువరాజుకొడుకయిన సంగభూపాలుడు పదునాఱవ శతాబ్దముయొక్క కడపటి భాగమునందు రాజ్యము చేసినట్టే యూహింపదగియున్నది. ఆతని యాశ్రితు డగుటచేత రామకృష్ణకవియు 1560-70 సంవత్సరప్రాంతమునుండి కవియై యుండవచ్చును. కవి పాండురంగమహాత్మ్యమును వేదాద్రి కంకితము చేయునప్పటికే వేదాద్రికి కొడుకులు మొదలయినవారు కలిగియున్నట్లీపద్యము వలన దెలియవచ్చుచున్నది.


క.సోదరులు సుతులు సతులును

నేదోదితమార్గచర్య వినయము నయమున్

శ్రీదాంపత్యము నెసగగ

వేదాద్రిమహాప్రధాని వెలయుం గృతులన్.


రెట్టమతమును రచియించిన యయ్యలరాజు అయ్యలభాస్కరుల కాలమునుబట్టి చూడగా రామకృష్ణు డింకను దరువాతివాడని తెలి