పుట:AndhraKavulaCharitamuVol2.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూర్మపురాణమునందు రాజలింగకవి కవిస్తుతిచేయుచు "రంగనాథుని రామలింగకవిని" అని రామలింగనామమునే వాడియున్నాడు. ఈరామకృష్ణకవి గృష్ణామండలములోని తెనాలిగ్రామమునందు శాలివాహనశకము 1384 వ సంవత్సరమున ననగా క్రీస్తుశకమ 1462 వ సంవత్సరమున జనన మొందెననియు, ఈతనియింటిపే రీశ్వరప్రెగడవారనియు, పయికాలమును సూచించెడి యీతని జన్మపత్రికవలన నితడు మంచిలగ్నమున బుట్టినట్టు కానవచ్చుచున్నదనియు, అఱువదిసంవత్సరములక్రిందట తమదక్షిణహిందూస్థానకవిచరిత్రమునందు కానలి వేంకటరామస్వామిగారు వ్రాసియున్నారు. అయినను మన కీతనికాలమును గూర్చి యిప్పుడు దొరకిన నిదర్శనములనుబట్టి చూడగా పూర్వోక్తకాలము సరియైనదని నమ్ముటకు వలనుపడదు. రామకృష్ణకవి దని చెప్పబడెడు జన్మపత్ర మిటీవలివారిచేత సృష్టింప బడిన దయి యుండవలెను. అటుగాక యితడు పయిని జెప్పబడిన సంవత్సరమునందే జన్మించి యుండినపక్షమున, ఈకవి కృష్ణదేవరాయలు సింహాసనమునకు వచ్చునప్పటికే దాదాపుగా నేబదియేండ్ల ప్రాయము గలవా డయి యుండవలెను. రామకృష్ణకవి యప్పయదీక్షితుల వారితోను తిరుమల తాతాచార్యులతోను సమకాలికు డయి చంద్రగిరిరా జగు వేంకటపతిరాయల ప్రభుత్వకాలములో నుండినవా డయినట్లు కొన్నినిదర్శనములు కనబడుచున్నవి. ఈవేంకటపతిరాయలు వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయల యనంతరమున తనరాజధానిని విజయనగరమునుండి చంద్రగిరికి మార్చుకొని క్రీస్తుశకము 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినవాడు. కృష్ణరాయని మరణానంతరమున నేబదియైదుసంవత్సరములకు రాజ్యమునకు వచ్చిన వేంకటపతిరాజుయొక్క రాజ్యకాలములో నున్న రామకృష్ణకవి నిజముగా నొకవేళ కృష్ణదేవరాయల కాలములో గూడ నుండుటయే తట