పుట:AndhraKavulaCharitamuVol2.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశదవాత్సల్యమున మున్ను కుశల మొసగి

పిదప గౌశికుఋణము సంప్రీతిదీర్ప

గూడునట్లుగ బెనిమిటి గొడుకు గరుణ

నరసి రక్షింపవయ్య జోహారునీకు.


శా. ఏణీలోచన నానిమిత్తమున నీ కీపాటు పాటిల్లెనే

క్షోణీనాథులరాణివాసములు చక్షుకౌతుకాపాదిని

శ్రేణీలాలితహర్మ్యవాటికలలో గ్రీడావి శేషంబులన్

బ్రాణేశాన్వితలై నిరంతరసుఖప్రౌడిన్ వినోదింపగన్. [ఆ.4]


మ. అకటా చేరెడు నేలకుం దగడె సప్తాంభోధివేష్టీభవ

త్సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోజ్జ్వల

ప్రకటానర్గళనిర్గళత్కిరణశుంభత్పాదు డై నట్టిరా

జుకుమారుం డని యేడ్చె గన్ను గవ నశ్రు ల్కాల్వలై పాఱగన్. [ఆ.5]

                           _______

28. కంచి వీరశరభకవి

ఈకవియు శంకరకవివలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు . ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమకావ్యములను రచియించినట్లు తోచుచునంది. ఇందు శంకరకవిపుస్తకమునకంటె నేబదిపద్యము లధికముగా నున్నవి. ఒకరు వ్రాయుచున్నకథ నొక రెరుగకయిరువురుకవులును గౌరనమంత్రికృతమైన ద్విపదకావ్యము ననుసరించి తమ పద్యకావ్య