పుట:AndhraKavulaCharitamuVol2.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములో నున్నట్లు కవికృతినాయకుని గూర్చి పంచమాశ్వాసాంతమున సంబోధించిన యీ పద్యమువలన దెలియవచ్చుచున్నది.


క. అలఘుప్రతాపకుతుబన|మల కేంద్రకృపాసమగ్రమహిమాన్విత కా

ర్కొలనిగ్రామని కేతన|జనసీమారక్షణై కచాతుర్యనిధీ.


ఈకుతుబనమల కేంద్రుడు సాధారణముగా నిభరామని చెప్పబడెడి యిబ్రహీము కుమారు డయినమహమ్మదు కుతుబ్‌షా. ఇతడు క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును గోలకొండలో రాజ్యము చేసినందున, కవియు నప్పుడే యుండి పదునాఱవ శతాబ్దాంతముననో పదునేడవశతాబ్దాదియందో యీపుస్తకమును జేసియుండును. శంకరకవివిరచితమైన హరిశ్చంద్రోపాఖ్యానము మృదుమధురపాకము గలదయి రసవంత మయి సహృదయహ్లాదకరముగా నుండును. ఇందలి పద్యముల నొక్కొక్కయాశ్వాసమునుండి యొక్కొక్కదాని నిందుదాహరించెదను.


శా. ఆకర్ణింపుము పాకశాసన సుపర్వానీకసంసేవ్య భూ

లోకాధీశు డగణ్యపుణ్యుడు కృపాలోలాత్మకుం డర్థిర

క్షాకల్పద్రుమ మద్రిధీరుడు హరిశ్చంద్రాభిధానుండు ధా

త్రీకంతుం డొక డొప్పు సూనృతవచ:శ్రీవభవోపేతుడై. [ఆ.1]


చ. మును ధర యేలి చన్ననృపముఖ్యు లనేకులు చర్చచేసినన్

జనవర వారిలోన విలసన్మతిపారగు లెవ్వరైన సొం

పున దమవెంట ముంటిమొనమోపగజాలినయంతమేరయున్

గొని చనిరే ధరాతలము కొంకకుమీ యిల దానమిచ్చుచోన్. [ఆ.2]


సీ. పరమపావనతేజ పావక సదయాత్మ హరిణాంకమౌళిపర్యాయకాయ

యనఘపాతివ్రత్యమున మనోవాక్కాయకర్మవిస్ఫూర్తిచే ధర్మనిరతి

బూని చరించితినేని మత్ప్రాణేశ్వరుండు సూనృతవచోరూడి మెఱని

భూనుతకీర్తివిభూతిశోభితుడేని శీతలాకృత మౌనిశిష్యునకును