పుట:AndhraKavulaCharitamuVol2.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ. అధిపతి నంచు గ్రద్ద మిము నందఱ నీనగవింధ్యవాసకున్

వధ యొనరించి మాంసము లవారణగా బలిపెట్టజూచె మీ

రధములువోలెనుండ దగదన్న ఖగంబులుపల్కె మమ్ము నీ

విధమున బాపగాదలచి వీడగనాడుట మీకు ధర్మమే. [ఆ.3]


ఉ. అంతట రాగమంజరి గృహంబున సీధురసంబు గ్రోలి యే

కాంతమ యప్పురంబు చిఱుగ్రంతల నేగ దలారిమానుసుల్

చెంతల డాసి పట్టుకొని చేతుల దంపిన నన్నుమిన్న యా

ప్రాంతమునందు ద్రెళ్ళి కెళవారయుదూతిక గాంచె నాదటన్. [ఆ.4]

                           _________

27. శంకరకవి

ఈకవి హరిశ్చంద్రోపాఖ్యానమును పద్యకావ్యమునుగా రచించెను. ఈకావ్యమును నెల్లూరికావ్య మనియు, కవిని నెల్లూరి శంకరకవి యనియు, బ్రౌన్ దొరగారు వ్రాసిరికాని యావ్రాత నిరాధారమైనది. కవి గోదావరి మండలములోని వాడు; కృతి నాయకుడైన యీడూరి యెల్లనయు గోదావరీమండలములోనివా డయి యీడూరి కరణమును కార్కొలనువాసస్థుడు నయియుండెను. ఈయంశములను కవి తనపుస్తకమునం దిట్లు చెప్పినాడు.-


గీ. మతి వితర్కింప గేవలమంత్రిమాత్రు

డే ధనంజయబాహుశౌర్యాధికుండు

సత్యవర్తను డీడూరిశాసనుండు

హితవచోహరి బాచయయెల్లశౌరి.

న. అమ్మంత్రినిధానంబునకు నిజస్థానంబు