పుట:AndhraKavulaCharitamuVol2.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱియొక కృతిపతి కొండస్ పల్లికిని ప్రభువగుట చేత నీ కవి కృష్ణా మండములోని కొండ వీటి సీమ వాడయినట్లు స్పష్ట పడుచున్నది. కొకోకమునందు కవి తన్ను గూర్చి యిట్లు వ్రాసికొని యున్నాడు.


సీ. శ్రీవత్స గోత్ర ప్రసిడ్ఢ సంభూతి నాపస్థంబ సూత్రప్రశస్తఘనుడ
గురుదయానిధి మైన కూచన మంత్రికి నంగనామణి ముత్తమాం
దనయుండ సత్కవీంద్రసుమాన్య చరితుండ శివ కృపాసుజ్ఞాన శే
నారూఢ విద్యా చలానంద యోగిండ్ర శిష్ట ప్రచార విశిష్ట ఘనుడ


నెఱ్ఱ నామాత్య పుత్రుడ సత్కవీంద్ర హితుడ
గలితవాక్ప్రౌఢి కొక్కోక కవివరుండడ
జతురమతితోడ రతి కళాశాస్త్రవ్ మిదియు
గెనుగు గావింతు రసికులు వినుతి చేయ.


శా. ధారాపట్టణ మేలు భోజుడు మహోదారుండు వాహ్యాళికై
నారణ్యంబున కేగి వచ్చునెడ బ్రహ్మప్రాప్తభూయావనా
శారంభ స్థలి చేరువం జనగ సైన్య వ్రాతముం జూచి య
ప్పాఱు డిట్లనె జొన్న చొచ్చి వలెనా బక్షింపుడీ బియ్యము


ఉ. ఊరక యేలయుండ మన మోశుకరత్నమ యస్మదీయసం
చార వినోదము ల్కలిసి సల్పుదమన్న దొలంగు చేద కో
కీరమ పూరుషు ల్బహుళ కిల్బిషచారు లసత్య భాషణుల్
క్రూరులు వారితోడ నొడగూడి మనంగలరే వధూమణుల్