పుట:AndhraKavulaCharitamuVol2.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. సడి గాకుండగ నుగ్రసేననృపు భిక్షావృత్తి బట్టంబునం

దిడి కంసార్జితరత్నకోటులు మహాహేమంబు లాందోళికల్

పడుతు ల్పర్వతసన్నిభేభములు ఝంపాసంపతద్వాహముల్

నడపించెం దనయింటి కీ వెఱుగవే నారాయణుం డుద్ధవా. [ఆ.2]


చ. కళలు భజింప వచ్చు శశికాంతివిధంబున నేగు దెంచె నా

యెలు గుల ఱేనియాజ్ఞ గమలేక్షణుసన్నిధికిన్ సఖీజనా

వళి భజియింప జాంబవతి వజ్రమయాభరణౌఘశింజితం

బులు పదవమ్మ నీ వనుచు బుజ్జవ మారంగ బల్కునట్లుగన్. [ఆ.7]


ఉ. భోజనపాత్ర మొక్కటి యపూర్వము పర్వతధారి కిచ్చెనం

భోజభవప్రసూతి యది భోజనవేళ దలంచుభోజ్యముల్

యోజనసేయజాలు నది యోజనమాత్రవిసారి కాంతివి

భ్రాజితగారుడాశ్మవిసరస్థగితంబు విషాపహారియున్. [ఆ.3]


మ. అమృతస్యందము కందళింప దరహాసాంకూరముల్ లోచనా

గ్రములం దాండవ మాడ జంద్రధరు డాకంజాక్షు నీక్షించి యో

కమలాక్షా పరురీతి నీవు వ్రతదీక్షన్ రూక్షచర్యాసము

ద్వమముం జూపుదు వయ్య యెయ్యడ సుహృద్భావంబె యీ చందముల్. [ఆ.4]


చ. కమలసహస్రము న్నయనకాంతి యొనర్పగ ఫాలబింబముల్

గుముదహితా యుతంబు నొడగూర్పు బెనంగు మృగాక్షిమోముతో

గమలము జంద్రు బోల్చుకవిగాథల కెయ్యదిమేర యుత్తమో

త్తము నధము న్సమాన మన దారదె బుద్ధి యవజ్ఞం చేరదే. [ఆ.4]


చ. అనుచుం బెగ్గిలి కుందునంగనల నయ్యబ్జాక్షి వీక్షించి యో

యనుగున్నె చ్చెలులార మీరలు సరోజాలి న్మనోజాతు గ్రొ

న్ననలం జిల్కల గోకిలప్రతతి నింద ల్సేయగా నేల నా

తనువే నిత్యము ప్రాణ మేమి ధ్రువమే తర్కింపుడీ యీదెసన్. [ఆ.5]