పుట:AndhraKavulaCharitamuVol2.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భవ్యలక్ష్మీవిలాసవిభ్రమము లలరు

చక్రధరమూర్తి పురుకుత్సచక్రవర్తి. [ఆ.6]


చ. ఘనములదర్పణంబు లిభకర్ణతలాగ్రము లెండమావు ల

వ్వనధితరంగము ల్సిరులు, వాయువుముందఱ నిడ్డదీపముల్

వనములబుద్బుదంబులు జలంబులపై లిఖియించువర్ణముల్


తనువులు, రాకుమార పరితాపము వల్వదు నీమనంబునన్. [ఆ.7]

చ. సరసుల దేలి పుష్పవనసంతతిపై గడువ్రాలి సుప్తబం

భరముల దోలి చారుశుకపంక్తుల నేలి ప్రసూనగంధ మా

దరమున గ్రోలి పుష్పితలతాతరు లెక్కుచు పోలి మెల్లగా


జరగగజొచ్చె దక్షిణపు జల్లనిగాలి వయాళిపెంపునన్. [ఆ.8]

                        __________

24. రామరాజు రంగప్పరాజు.

ఈక్షత్రియకవి సాంబోపాఖ్యాన మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగనాయకున కంకితము చేసెను. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డైన రామరాజునకు బెదతండ్రికొడుకు కోనేటి తిమ్మరాజున కాశ్రితుడై యుండినవాడు. కాబట్టి కవి 1550 వ సంవత్సరప్రాంతములం దుండినవా డని నిశ్చయముగా జెప్పవచ్చును. కోనేటితిమ్మరాజునకును రామరాజునకును తాత యగు నార్వీటిరామరాజును, కృష్ణదేవరాయనియల్లు డగురామరాజును, కవి తనసాంబోపాఖ్యానమునం దిట్లు వర్ణించియున్నాడు-