పుట:AndhraKavulaCharitamuVol2.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహుధామ బహుధామ బహుధామచిత్రంబు

ఘనసార ఘనసారగంధిలంబు

భవ్యకాసార కాసారబంధురంబు

జవనసైంధవ సైంధవసంకులంబు

బహుళకేతన కేతనభస్థలంబు


నై విజృంభించె సిరి నయోధ్యాపురంబు. [ఆ.1]

ఉ. రాజవు నీవు సద్గతి తెఱంగు లెఱింగి బుధానురాగివై

యాజరుచిం జెలంగి సముదంచితవిష్ణుపదానువర్తి వి

భ్రాజితసత్కళానిధివి రశ్మి యొకానొకవేళ నిండినన్


హా జనపాలకా కువలయం బడలన్ గృశియించు టొప్పునే. [ఆ.3]

చ. అతను వియోగతాపము నిజాంగమునం దగ నిండియుండగా

నతివ సతృష్ణయై నలకథామృత మెంతయు గ్రోలె నందునన్

మిత మెడల న్వెసన్ జ్వరము మించె నటంచును దత్సఖీభిష

గ్వితతులు దానికిం దగుచికిత్సలు చేయ దొడంగి రత్తఱిన్. [ఆ.4]


సీ. గోరక్షణము చేయుశౌరి యుండుట జేసి

గోరక్షణము చేయుకోర్కె మెఱసె

బుధులబ్రోచెడు చతుర్భుజు డుందుటనుజేసి

బుధుల బ్రోచుచునుండు బుద్ధిమించె

సత్యానురక్తు డౌచక్రి యుండుట జేసి

సత్యానురక్తుడై చాల నెలసె

బలభద్రయుతుడు శ్రీపతి యుండుటనుజేసి

బలభద్రయుక్తుడ్తె ప్రజ్ఞ మీఱె

నొడల బురుషోత్తముడు పూనియుంట జేసి

తాను బురుషోత్తముం డన ధాత్రి నొప్పె