పుట:AndhraKavulaCharitamuVol2.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలయంబ్రాకుచువచ్చి యన్నెలవునన్ గన్నీటియే ఱడ్డమై నిలుప న్నిల్చె నృసింహభూరమణ మన్నింపంగ బాడింతటన్. [ఆ.2]

ఉ. చందనశైలసానువుల జాల జెలంగుభుజంగబాలికా బృందము శ్రీనృసింహవిభు బేర్కొనిపాడ దదీయగానని ష్యందము లానువేడ్క బెరయంగ గురంగతురంగ మేగిమిన్ మందగతిప్రసంగములు మానవు దక్షిణగంధవాహముల్. [ఆ.5]

                           __________

23. మల్లారెడ్డి

ఇతడు రచియించిన షట్చక్రవర్తులచరిత్ర మను నెనిమిదాశ్వాసముల పురాతనగ్రంథ మొకటి నాయొద్దనున్నది. దీనిని తాలపత్రముల మీద వ్రాసినవా రేహేతువుచేతనో కృత్యాదిపద్యములను వదలివేసి షష్ఠ్యంతములు మొదలుకొని వ్రాసియున్నారు. ఈపుస్తకమునందలి యాశ్వాసాంతగద్య మిట్లున్నది.

"ఇది శ్రీమద్బిక్కనవోలిపట్టణ ప్రసిద్ధ సర స్తటావలంబ సిద్ధరా మేశ్వర వరప్రసాద సమాసాదిత సంస్కృ తాంధ్రభాషాకవి రతాసపోషణ విశేషతా చమత్కార గురుభక్తివిహార రాచుళ్ల గోత్ర పవిత్ర కాచభూపాలపుత్ర బుధవిధేయ మల్లారెడ్డి నామ

ధేయ ప్రణీతంబైన షట్చక్రవర్తి చరిత్రంబను మహాప్రబంధంబు నందు___ఆశ్వాసము."

ఈమల్లారెడ్డి యిభరా మని మనపుస్తకములలో జెప్పబడిన యిబ్రహీము గోలకొండ నవాబుగా నున్నకాలములో నుండి యొకసారి యాతని యాస్థానమునకు దనయాస్థానకవీశ్వరుని తోడగూడ బోయినప్పుడు,