పుట:AndhraKavulaCharitamuVol2.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనబడుచున్నది. కాబట్టి రామరాజభూషణుడు 1550 వ సంవత్సరము మొదలుకొని 1590 వ సంవత్సరమువఱకును గ్రంథరచన చేయుచున్నట్లు చెప్పవచ్చును. పూర్వోక్తములయిన మూడు గ్రంథముల నుండియు గొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను.

వసుచరిత్రము

మ. సతియూరుద్యుతి జెందబూని నిజదుశ్చర్మాపనోదక్రియా

రతి బాథోలవపూరితోదరములై రంభేభహస్తంబు లు

న్నతఱిన్ వీడె మరుద్విభూతి గదళిం ద్వగ్దోష సూచంచలో

ద్ధతశుండాతతి బాయ దయ్యె నడె పో తద్వైరమూలం బిలన్.


[ఆ.1]శా. రాజీవాక్షుల నేచుపాతకివి చంద్రా! రాజవా నీవు? నీ

రాజత్వంబున జక్రముల్ మనియెనో? రంజిల్లి సత్సంతతుల్

తేజం బందెనొ? డిందెనో యహిభయోద్రేకంబు? తా జెల్లరే!

రాజై పుట్టుట రశ్మిమాత్రఫలమే? రా జౌట దోషార్థమే? [ఆ.4]

హరిశ్చంద్ర నలోపాఖ్యానము

ఉ. కమ్మనిపువ్వుదేనియల గాక లడంచు బ్రవాళతాళనృం

తమ్ముల సేదదేర్చు విరతావులచల్వులు గ్రమ్ముమంచిపూ

దుమ్ముల బూజసల్పు బ్రతతు ల్వరమంజులతాధిరాజ్యయో

గమ్మున బొల్చు నాసుగుణకల్పవల్లి వనిం జరింపగన్. [ఆ.3]


చ.కుదురుమెఱంగునిబ్బరగుబ్బలపై నయనాంబుపూరముల్

చెదరగ నేల యేడ్చెదవు చెల్వ దురంతవిషాదవేదనా

విదళితమానసాబ్జవయి వే తగు వాయువు శాశ్వతంబె సం

పదలు స్థిరంబులే విధివిపాకము దాట దరంబె యేరికిన్. [ఆ.5]

నరస భూపాలీయము

మ. బలితంబై నమనోజబాణహతిచే, బల్మాఱు నిల్పోపలే

కలినీలాలకప్రాణము ల్వెడలి నేత్రాంభోజమార్గంబునన్