పుట:AndhraKavulaCharitamuVol2.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులిప్పటివలెనే పూర్వకాలమునందును విద్యామత్సరము కలవారయి యొండొరులతో వివాదములు పెట్టుకొనుచుండినట్లు కనబడు చున్నది. ఇట్టి యసూయపరత్వము రామరాజభూషణునివద్ద సహితము బొత్తిగా లేకపోలేదు. ఇతడొకసారి యయ్యలరాజు రామభద్రకవి కవిత్వమునందు తప్పుపట్టబోయి యవమానము నొందెనట. రామభద్రకవి విరచితమైన రామాభ్యుదయమునందు తప్పుచూపెదనని పంతము పట్టి, తప్పు చూపలేకపోయినయెడల తలమీద తా నాతనితన్ను తినెదనని రాజసభలో రామరాజభూషణు డొప్పుకొనెనట. అంతట మధ్యవర్తుల సమక్షమునందు గ్రంథపఠన మారంభించి చదువుచుండగా ద్వితీయాశ్వాసారంభములోని


సీ.సింహనఖాంకురచ్ఛిన్నవారణకుంభజనితముక్తాఫలశర్కరిలము

సమదసూకరపరస్పరభీకరాఘాతశిధిలదంష్ట్రాచూర్ణసికతిలంబు

గంధసింధురఘటాకటకటాహప్రవద్బంధురదా నాంబుపంకిలంబు

దవగంధవహబంధుదహ్యమానానేకకౌశికాగురుధూపగంధిలంబు


పృథులషడ్జస్వరోద్గితభిల్లపల్ల

వాధరాగీతికాకర్ణ నాతిభీతి

పరవశాత్మపటీరకోటరకుటీర

లీనఫణియగు నక్కాన కాన నయ్యె.


అను పద్యముకడకు వచ్చునప్పటికి రామరాజభూషణుడు రామభద్రకవిని వారించి "శిశుర్వేతి పశుర్వేతి వేత్తి గానరసం ఫణి" యనున్యాయముచేత సంగీతమునకు సర్సము లానందింపవలసియుండగా భయపడి పటీరతతు కోటరములలో దాగినట్లు చెప్పితివిగాన నిది దోషమని యాక్షేపించెనట. దానికి రామభద్రకవి తాను కేవల సంగీతమునకు భీతిల్లినట్లు చెప్పక షడ్జస్వరముతో పాడబడిన గీతికకు పాములు