పుట:AndhraKavulaCharitamuVol2.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గగా నతడు చేతిలో బూడిద వేసికొని యందు శ్రీ యనునక్షరమును వ్రాసి చేయి నోటిదగ్గఱగా బెట్టుకొని బిగ్గరగా శ్రీభూపుత్రి యని (భూ) ద్వితీయాక్షర మొత్తి చదువగానే యాగాలిచేత చేతిలో వ్రాసిన శ్రీ యెగిరిపోవుట చూపె ననియు, అందుమీద రాజు కృతినందక నిరాకరించెననియు పనికిమాలిన కథయొకటి చెప్పుదురు. ఈ ప్రకారముగానే రామరాజభూషణుడు "నానాసూనవితానవాసస"లన్న పద్యమును నందితిమ్మన్నయొద్దను "మోహాపదేశ తమోముద్రితములైన" యను పద్యము నయ్యలరాజు రామభద్రుని యొద్దను కొని తన వసుచరిత్రము నందు వేసికొనెనని కొందఱు కొన్నికథలు కల్పించి యున్నారుగాని యవి యన్నియి నవిశ్వసనీయములే. అటువంటి యుద్గ్రంధమును జేయ గలిగిన మహాకవి రెండు సామాన్యపదములను జేయలేక యితరులవలన దొంగలించి తనవిగా దన గ్రంథమునందు వేసికొనెనని చెప్పుటకంటె బరిహాసాస్పద మయిన మాట మఱియొకటి యుండదు.

రామరాజభూషణు డొకనాడు సభలో రాజాజ్ఞమీద కవీశ్వరులకు "కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్" అని సమస్య యియ్యగా తెనాలిరామకృష్ణుడు


 క. గంజాయి త్రాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజెలకొడుకా ! యొక్కడ
గుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్?

అని పూరించె ననియు, అదియే రాజు తానిచ్చినట్లు భావించి పూరింపుమని యడుగగా

 <poem> క. రంజన చెడి పాండవు లరి 

భుంజనులై విరటుగొల్వ బాల్పడి రకటా!