పుట:AndhraKavulaCharitamuVol2.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కును ప్రబంధములను జేయబూనిన కవు లెల్లరు వసుచరిత్రమును ప్రతి రూపముగా జేకొని దాని ననుసరించి తమగ్రంథములను రచియించు చున్నారు. ఈ వసుచరిత్రము హూణశకము 1570 వ సంవత్సరమునకు దరువాతనే రచియింపబడినది. వసుచరిత్ర కృతిపతియైన తిరుమల దేవరాయడు 1567 వ సంవత్సరమునందు తనరాజధానిని పెనుగొండకు మార్చెను. ఈతడు పెనుగొండను రాజధానిగా జేసికొన్నతరువాత మహమ్మదీయులతో జరిగిన యుద్ధవార్త వసుచరిత్రలోని యీ పద్యమునందు జెప్పబడియున్నది-


చ. తిరుమలరాయ శేఖరునిధీరచమూభటరాజి యాజి భీ

కరయవనేశ్వరప్రహితఖానబలంబుల జక్కుసేయ ని

ద్ధర బెనుగొండకొండలు మదద్విపచర్మకపాలమాలికా

పరికరభూషితంబు లయి బల్విడి గాంచె గిరీశభావమున్.


తిరుమలదేవరాయలు తనజ్యేష్ఠపుత్రు డయిన రఘునాథరాజు మృతుడయినతరువాత ద్వితీయపుత్రు డయిన శ్రీరంగరాజును యువరాజునుజేసి రాజ్యభారము నాతనిమీదమోపిన కథగూడ సూచనగా నీపుస్తకమునందు జెప్పబడియున్నది-


చ. హరిపదభక్తిశీలుడగు నారఘునాథనృపాలుకూర్మిసో

దరుడు సింగరాయవసుధావరు డాత్మగుణప్రమోదవ

త్తిరుమలరాయ శేఖరవితీర్ణ మహాయువరాజపట్టబం

ధురడయి సర్వభూభువనధూర్వవాశ క్తివహించు నెంతయున్.


తిరుమలదేవరాయ డవసానదశలో తనరాజ్యభారము నంతను కొడుకులమీద వదలివేసిన తరువాత మూడవకొడు కయిన వేంకటపతిరాజు ఆలీ ఆడిల్ షాతో యుద్ధము చేసి పరాజితుడయి 1777 వ సంవత్సరమునందు రాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మరల మార్చెను. వేంకటపతిరా జోడిపోయినసంగతిని జెప్పకపోయినను కవి