పుట:AndhraKavulaCharitamuVol2.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిప్పాజీ నాగలాదేవ్యో కౌసల్యా శ్రీసుమిత్రయో:

జాతౌ వీరనృసింహేంద్ర కృష్టరాయ మహీపతి:

అస్మాదోబాంబికాదేవ్యా మచ్యుతేంత్రోపి భూపతి:

కృష్ణదేవరాయలతండ్రి నరసింహ రాజే మధుర శ్రీరంగపట్టణము మొదలయినవానిని జయించి తద్దేశముల నాక్రమించినట్లు పారిజాతాపహరణములోని యీక్రిందిపద్యమువలన దేటపడుచున్నది.

సీ. కుంతలేశ్వరుడు చిక్కుపడంగవిద్యాపురంబు గైకొని నిజప్రౌడినెఱపె

బారసీకునకు దుర్భరమానవత్వంబు దొలగించె మానవదుర్గసీమ

జోళవల్ల భునకుసురవధూమధురాధర ములిచ్చిమధురాపురంబుగొనియె

శ్రీరంగ పట్టణసీమ ఖడ్గనటీవినోదంబు హావనేంద్రునకు జూపె

నతడు నుతికెక్కె రామసేత్వంతరాళ

కలితషోడశ దానవిఖ్యాతయశుడు

మండలీకర మేఘమార్తాండబిరుదు

డీశ్వరాధిపు నరసపృధ్వీశ్వరుండు.

1509 వ సంవత్సరమునకు సరియైన శాలివాహనశకము 1430 శుక్ల సంవత్సర వైశాఖమాసమునందు సింహాసనమునకు వచ్చువఱకును గల కృష్ణరాయనిచరిత్రము విశ్వాసార్హమైన దేదియు తెలియదు. వీర నృసింహరాయని పై జూపు ప్రేమముకంటె దండ్రి కృష్ణరాయనియెడ నధికప్రేమమును జూపుచు వచ్చెననియు, అది చూచి సహింపలేక వీరనృసింహరాయని తల్లి తన సపత్నీపుత్రుని జంపింప బ్రయత్నింపగా మంత్రియైన తిమ్మరు సాజాడ గనిపెట్టి యాతనిని దాచి ప్రాణమును రక్షించి కాపాడె ననియు, తరువాత గొంతకాలమునకు నృసింహదేవరాయలు జబ్బుచేత బాధపడుచు బ్రాణావసానకాలమునందు గొడుకులను బిలిచి తనవ్రేలియుంగరమును దీసికొన్నవాడు రాజ్యార్హు డని