పుట:AndhraKavulaCharitamuVol2.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చుచున్నది. పూర్వకాలమునందే యితడిట్లు వ్రాయుటనుగూర్చి మేమిచెప్పెదరు ? ఇతడు సావధానముగా గ్రంథమును బరిశీలించి ప్రతివాదులు తమ వాదమున కనుకూలములుగా నుదాహరించెడు గద్య పద్యముల కన్నిటికిని బ్రతిపదార్థమును వ్రాసి విమర్శించినవాడేకదా ?

3. అనేక గ్రంథములను జేసిన గొప్పకవులు సమానవర్ణనలు వచ్చెడుపట్టున తాము మొదట రచియించినగ్రంథములలో నుండి పద్యములను జేకొని యా వశ్యకములైన మార్పులను జేసి తరువాత రచియించెడుగ్రంథములలో జేర్చుకొనెడి యాచారముగలదు. తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణములో మూడవయాశ్వాసమున,


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబున గేల దార భీ

షణముగ నుప్పతిల్లి రభసంబున రేగినమాడ్కి దీన్రమా

ర్గణనికరంబులొక్కట నరాతిబలంబుల గప్ప శార్‌జ్గని

క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్.


అని రచియించినపద్యమునే విరాటపర్వములో నయిదవయాశ్వాసమున గొంచెము మార్పుచేసి యీక్రిందిరీతిగా బ్రయోగించు చున్నాడు-


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబున గేల జాల భీ

షణముగ నుప్పతిల్లి రభసంబున రేగినమాడ్కి దీప్రమా

ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబుల గప్ప గాండివ

క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్.

ఇందు "తార" యనునది "చాల" గను "శారజ్గనిక్వణ" మనునది "గాండివ క్వణనము" గాను, మార్పబడినవి. మఱియు సోమయాజులు,


మ. కలగెం దోయధిసప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడె సం

చలతంబొందె వసుంధరావలయ మాశాచక్ర మల్లాడె గొం