పుట:AndhraKavulaCharitamuVol2.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూర్తియనుట స్పష్టము. దానికి బట్టు మొదలయిన పదములను వేనిని జేర్చినను, అవి కులనామములో బిరుదనామములో యయి యుండును. కావ్యాలంకారసంగ్రహ మనబడెడు నరసభూపాలీయము లోని పూర్వోదాహృతమయిన పద్యములో "శుభమూర్తినామధేయు" నని "శుభ" విశేషణమొకటి గానబడుచున్నది. ఈ శుభవిశేషణ మెట్లు వచ్చినది, ఎవ్వరికి జెందినది, అన్న విషయము నాలోచింపవలయును. పూర్వోదాహృత మయిన హరిశ్చంద్రనలోపాఖ్యానములోని పద్యములో రామభూషణకవి "రామవిభుదత్త 'శుభ' చిహ్న విభవయుతుడ" నని వ్రాసికొని యున్నాడు. కాబట్టి దీనినిబట్టి చూడగా శుభబిరుదమును రామరాజిచ్చెననియు, రామరాజభూషణ నామము గలవానికిది చెందుననియు, విస్పష్టమగుచున్నది. నరసభూపాలీయ కృతికర్త తనకు శుభవిషేషణమును వేసికొనుటయు, హరిశ్చంద్ర నలోపాఖ్యాన కృతికర్త తనకు రామరాజు శుభచిహ్న మిచ్చెనని చెప్పుకొనుటయు, ఈ రెంటిని గూర్చి చిరకాలము నుండి పరంపరగా వచ్చుచున్న జనప్రతీతితో జేర్చి విచారించినపక్షమున నారెండు గ్రంథములను రచించినవా రొక్కరేయని చూపుట కది యొక ప్రబలసాక్ష్యముగా గనబడుచున్నది. రామరాజభూషణపదము బిరుదనామమే యైనపక్షమున, పైపుస్తకములయందలి నామవ్యత్యాసములనుబట్టి కవులు వేఱనిచెప్పుట కవకాశ ముండదు.రామరాజభూషణపదము బిరుదుపేరుగాక పేరేయై యుండినయెడల నదియంతట నేకరూపముగా నుండునేకాని పై పద్య గద్యములయం దున్నట్లొకచోట "రామరాజభూషణ" యనియు, ఇంకొకచోట "రామభూషణ" యనియు, వేఱొకచోట "రామనృపభూషణ" యనియు నుండదని యొకయుక్తి చెప్పుదురుగాని యదియంత ప్రబల యుక్తికాదు. కట్టకడపట జేసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానములో "వసుచరిత్రాదికావ్య" "బహునృపప్రాపితానేకరత్న" పదములను బ్రయోగించుటచే నాదిపద ప్రయో