పుట:AndhraKavulaCharitamuVol2.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్కారుణ్యంబున రత్నహారహయవేదాండాగ్రహారాది స

త్కారం బందితి రామభూషణకవీ ధన్యుండ వీనన్నిటన్- [ఆ.1]


ఈ పద్యమునందు జెప్పబడినతడు కృష్ణదేవరాయని యల్లుడయిన యార్వీటి రామరాజు. కృష్ణదేవరాయని యల్లుడయినందున నీతనికి నళియరామరాజని సాధారణముగా వాడుకకలదు. ఈతడు కృష్ణదేవరాయని యల్లుడయి సదాశివరాయని రాజ్యబారమును వహించిన సంగతి రామాభ్యుదయములోని యవతారికయందీక్రింది పద్యమున జెప్పబడినది.


ఉ. ఆపటుకీర్తి రామవసుధాధిపచంద్రుడు కృష్ణరాయధా

త్రీపతిసార్వభౌమదుహితృప్రియుడై వితతప్రతాపసం

తాపితశత్రుడై యలసదాశివరాయనిరంతరాయవి

ద్యాపురరాజ్యలక్ష్మికీ విధానము దా నయి మించె నెంతయున్.


ఈ రామరాజు వివాహము చేసికొన్న కృష్ణదేవరాయని కూతురి పేరు తిరుమలాంబ. ఆమెవలన నీతనికి కృష్ణరాజు,పెదతిమ్మరాజు అని యిద్దఱుపుత్రులు కలిగిరి. ఈ సంగతి నరపతి విజయమునందీ క్రింది పద్యములలో జెప్పబడినది.


గీ. అనఘుడౌ నైరసేని భీమాధిపేంద్రు

పట్టి దమయంతి జేపట్టినట్టిరీతి

రామభూపాలకుడు కృష్ణరాయతనయ

యగుతిరుమలాంబ నుద్వాహనయ్యె వేడ్క.


చ. శతమఖునిం బులోమజను శంకరుని న్గిరిపుత్రి శంబరా

హితు రతిదేవి బోలుచు నహీనసుఖానువాప్తి రామభూ

పతియును దిర్మలాంబయును భానుసమానుని గృష్ణపాడ్యు నం

చితగుణు బెద్దతిమ్మనృపశేఖరు గాంచిరి హర్ష మొప్పగన్.